IGI Aviation Jobs 2025: ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:02 PM
10వ తరగతి లేదా ఇంటర్ పూర్తిచేసినవారికి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) ఎయిర్‌పోర్ట్‌లో జాబ్స్ కోసం నోటిఫికేషన్ (IGI Aviation Jobs 2025) వచ్చింది. వీటిలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? జీతభత్యాల వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

10వ తరగతి, ఇంటర్ పాసై, జాబ్ కోసం చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల కోసం 1,446 ఖాళీలను (IGI Aviation Jobs 2025) ప్రకటించింది. వీటికి 10వ తరగతి, ఇంటర్ పాసైన అభ్యర్థులు జులై 10, 2025 నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 21, 2025 వరకు అప్లికేషన్‌లను స్వీకరిస్తారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే విద్యా అర్హత, వయస్సు పరిమితి ఏంటి, జీత భత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అర్హతలు ఏంటి
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 12వ తరగతి లేదా తత్సమాన గుర్తింపు పొందిన అర్హత కలిగి ఉండాలి. 18-30 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరోవైపు లోడర్ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 10వ తరగతి లేదా తత్సమాన గుర్తింపు పొందిన బోర్డు నుంచి పాసైన 20-40 ఏళ్ల వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలు 1,017 ఉండగా, లోడర్ జాబ్స్ 429 కలవు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు క్రింది దశలను పాటించాలి
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: igiaviationdelhi.com
ఆ తర్వాత క్యాండిడేట్ సెక్షన్‌ను ఎంచుకోండి: హోమ్‌పేజీలో Apply Online Application లింక్‌పై క్లిక్ చేయండి
సూచనలను జాగ్రత్తగా చదవండి: కొత్త పేజీలో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి, డిక్లరేషన్ బాక్స్‌ను టిక్ చేయండి
ఆ తర్వాత వచ్చిన ఆన్‌లైన్ ఫారమ్ నింపండి: అవసరమైన వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయండి
ఫోటో & సంతకం అప్‌లోడ్ చేయండి: స్కాన్ చేసిన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
దరఖాస్తు రుసుము చెల్లించండి: ఆన్‌లైన్ మోడ్ ద్వారా రుసుము చెల్లించండి
ఫారమ్‌ను సమీక్షించండి: అప్లికేషన్ సమర్పించే ముందు ఫారమ్‌ను ఒకసారి సమీక్షించండి
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు రూ. 350, లోడర్ జాబ్స్ కోసం రూ. 250 చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు మొదట రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే, తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఈ రెండు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులు చివరకు ఎంపిక చేయబడతారు. ఈ క్రమంలో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు జీతం ఉండగా, లోడర్ జాబ్స్‌కు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ఉంది.
ఇవి కూడా చదవండి
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి