BIS Careers: BISలో ఉద్యోగాలు.. డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో రూ.75 వేల జీతం
ABN , Publish Date - Apr 19 , 2025 | 07:53 PM
డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి 160 కొలువులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి, మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మీకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. BISలో 160 కన్సల్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డిగ్రీ లేదా బీటెక్ సంబంధింత అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో ఎంపికైతే మీకు నెలకు రూ.75,000 వరకు జీతం లభిస్తుంది. అంతేకాదు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి ఫీజు అక్కర్లేదు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం, గొప్ప గౌరవం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.
ముఖ్యమైన వివరాలు
సంస్థ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)
ఉద్యోగాల సంఖ్య: 160
అర్హత: డిగ్రీ లేదా బీటెక్ సంబంధిత విభాగంలో అర్హతలు కల్గి ఉండాలి
జీతం: నెలకు రూ.75,000 వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
అధికారిక వెబ్‌సైట్: www.bis.gov.in
గరిష్ట వయోపరిమితి: 65 సంవత్సరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 19, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 09, 2025
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బీటెక్ సంబంధిత విభాగంలో పూర్తి చేసినవారు. వయోపరిమితి, ఇతర అర్హతల వివరాల కోసం అధికారిక పూర్తి నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ:
అధికారిక వెబ్‌సైట్ www.bis.gov.inకి వెళ్లండి.
"Careers" లేదా "Recruitment" సెక్షన్‌లో తాజా నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.
అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి (వర్తిస్తే).
ఫారమ్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది
వచ్చిన దరఖాస్తులను విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు
షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారులకు సాంకేతిక పరిజ్ఞానంపై టెస్ట్ నిర్వహిస్తారు
ఆ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి చివరకు ఎంపిక చేస్తారు
గమనిక: దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి. చివరి తేదీ, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ముందుగా పరిశీలించి, తర్వాత నిర్ణయం తీసుకోండి.
ఇవి కూడా చదవండి:
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News