Share News

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:44 PM

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎందుకంటే తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 పోస్టులకు నోటిఫికేషన్ (Bank of Baroda Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank of Baroda Recruitment 2025: 2500 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ అర్హత, రూ.85 వేల జీతం
Bank of Baroda Recruitment 2025

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ (Bank of Baroda Recruitment 2025) వచ్చేసింది. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అయితే దీనికి అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I)లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.


అర్హత ప్రమాణాలు

  • విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ. చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీర్, మెడికల్ డిగ్రీలు చేసిన వారు కూడా అర్హులే.

  • వయోపరిమితి: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య (రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది)

  • అనుభవం: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం కల్గి ఉండాలి


దేశవ్యాప్తంగా 2500 ఖాళీలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ స్థానిక రాష్ట్ర భాషలో నైపుణ్యం కలిగి ఉండాలి. తద్వారా స్థానిక స్థాయిలో మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 04, 2025 నుంచి జూలై 24, 2025 వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన వివరాలు:

  • సంస్థ: బ్యాంక్ ఆఫ్ బరోడా

  • పోస్టు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) - JMG/S-I

  • ఖాళీలు: 2500

  • దరఖాస్తు తేదీలు: జూలై 04, 2025 – జూలై 24, 2025

  • విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ

  • వయోపరిమితి: 21-30 సంవత్సరాలు (01 జూలై 2025 నాటికి)

  • అనుభవం: షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్‌లో ఒక సంవత్సరం అనుభవం

  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

  • జీతం: రూ. 48,480/- (ప్రారంభ బేసిక్ పే)

  • దరఖాస్తు రుసుము: జనరల్/EWS/OBC - రూ.850, SC/ST/PWD/ESM/మహిళలు - రూ.175.

  • CIBIL స్కోర్: 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి

  • అధికారిక వెబ్‌సైట్: www.bankofbaroda.in


ఎంపిక ప్రక్రియ

  • BOB LBO రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఎంపిక ప్రక్రియ పలు రకాలుగా జరుగుతుంది

  • ఆన్‌లైన్ టెస్ట్: ఆబ్జెక్టివ్ ఆధారిత పరీక్ష, ఇందులో ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్/ఎకనామిక్ అవగాహన, రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి

  • లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT): స్థానిక భాషలో నైపుణ్యం లేని వారికి

  • సైకోమెట్రిక్ టెస్ట్: వ్యక్తిత్వం, బ్యాంకింగ్ రోల్‌కు సూటబిలిటీని అంచనా వేయడం

  • గ్రూప్ డిస్కషన్ (GD): కమ్యూనికేషన్, లీడర్‌షిప్ స్కిల్స్ అంచనా

  • ఇంటర్వ్యూ: బ్యాంకింగ్ నాలెడ్జ్, వైఖరి, బ్యాంక్‌కు సూటబిలిటీని పరీక్షించడం


ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 03:46 PM