Share News

APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:13 PM

గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి APPSC ఇంటర్వ్యూల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వ్యూ బోర్డులో నియామకం చేసినట్లు తెలుస్తోంది.

APPSC : ఏపీపీఎస్సీ  గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు..
APPSC Group 1

APPSC Group 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా ఇప్పుడు ఇంటర్వ్యూలకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం, జూన్ 23 నుంచి జూలై 15 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్-1 ఇంటర్వూలకు ప్రభుత్వ ప్రతినిధులను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వ్యూ బోర్డులో నియామకం చేసినట్లు తెలుస్తోంది.


గతంలో మే 3 నుండి 9 తేదీల మధ్య నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,497 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో ఉన్న 13 కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షల అనంతరం తక్కువ సమయంలోనే కమిషన్ మూల్యాంకనాన్ని పూర్తి చేసి జూన్ 10న ఫలితాలను విడుదల చేసింది.

మెయిన్స్ ఫలితాల ఆధారంగా, 1:2 నిష్పత్తిలో మొత్తం 182 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరికి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంటర్వ్యూల తేదీల వివరాలు అందుబాటులో ఉంచింది. ఇంటర్వ్యూ రోజునే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా జరుగుతుంది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే తమ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవడం ఉత్తమం.

అలాగే, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 42 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇప్పటికే జూన్ 17న పూర్తి అయ్యిందని కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయినవారే తుది జాబితాలోకి ఎంపిక కాబోతున్నారు. కావున, ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి.


Also Read:

సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి రచ్చ.. రచ్చ.. డాక్యుమెంట్స్‌ చించేసి..

ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్

For More Telugu News

Updated Date - Jun 18 , 2025 | 07:29 PM