Aadhaar Verification: SSC పరీక్షలకు ఆధార్ బయోమెట్రిక్ విధానం అమలు..ఆ దందాకు చెక్..
ABN , Publish Date - Apr 20 , 2025 | 02:56 PM
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పోటీ పరీక్షలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వచ్చే పరీక్షలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీని వల్ల ఏంటి లాభమనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మే 2025 నుంచి రాబోయే పోటీ పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి అభ్యర్థి విషయంలో కూడా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని (Aadhaar Verification) పాటించనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణను మరింత పరిశీలించండతోపాటు మోసపూరిత పద్ధతులను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ విధానం ద్వారా ఒకరికి బదులు మరోకరు పరీక్ష రాసినా కూడా ఈజీగా దొరికిపోయే అవకాశం ఉందని అధికారులు అన్నారు.
మూడు దశల్లో..
అతిపెద్ద నియామక సంస్థలలో ఒకటైన SSC, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నాన్ గెజిటెడ్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల ప్రకారం, SSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇకపై మూడు దశలలో ఆధార్ ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకుకోవాల్సి ఉంటుంది. మొదట ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో, ఆ తర్వాత దరఖాస్తు చేసేటప్పుడు, చివరగా పరీక్షా కేంద్రంలో కూడా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
అమలుకు కారణమిదే..
కమిషన్ తన రాబోయే పరీక్షలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, అభ్యర్థులకు పరీక్షా ప్రక్రియను సులభతరం చేయడానికి ఉద్దేశించినదని అధికారులు తెలుపడం విశేషం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే 12 అంకెల ఆధార్, ఒక వ్యక్తి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటాపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రమాణీకరణ విధానం నియామక పరీక్షలలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఉపయోగపడనుంది.
స్వచ్ఛందంగా అధికారం
2023 సెప్టెంబర్ 12న జారీ చేసిన నోటిఫికేషన్‌లో కేంద్ర వ్యక్తిగత మంత్రిత్వ శాఖ SSCని ఆధార్ విధానాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించడానికి అధికారం ఇచ్చింది. అది ఆధార్ (టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్) చట్టం, 2016, UIDAI జారీ చేసిన అన్ని సంబంధిత నిబంధనలు, నియమాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. SSC ప్రతి సంవత్సరం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGLE)తో సహా అనేక జాతీయ స్థాయి ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షలను, అలాగే మూడు పరిమిత డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ పరీక్షలను నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి:
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News