ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారు..
ABN , Publish Date - Jul 27 , 2025 | 07:07 AM
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రమఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. తలపెట్టిన కార్యం నెరవేరుతుందని, ఆందోళన తగ్గి స్థిమితపడతారని తెలుపుతున్నారు. ఇంకా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

అనుగ్రహం
27 జూలై - 2 ఆగస్టు 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగాఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కొత్త యత్నాలు మొదలెడతారు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. పనులు పురమాయించవద్దు. ఒక సమాచారం ఉత్సా హాన్నిస్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకో వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు కలుగుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. మీ శ్రమ ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వా నం అందుకుంటారు. ఒక సమాచారం ఆలో చింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో జాగ్రత్త. తాహతుకు మించి హామీలివ్వవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. రుణవిముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నోటీసులు అందు కుంటారు. పెద్దలను సంప్రదిస్తారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభ కార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేషమైన కార్యసిద్థి ఉంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మొదలు పెట్టేసరికి అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం సమస్యాత్మకమవుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. పంతాలు, భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. అందరితోనూ మితంగా మాట్లాడండి. మీ వ్యాఖ్యల్ని కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఆర్భాటాలకు విపరీ తంగా ఖర్చుచేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గృహమరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలు ఎదురవు తాయి. పత్రాలు అందుకుంటారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. రుణ విముక్తులవుతారు. ఖర్చులు అధికం. గృహం సందడిగా ఉంటుంది. కొత్త విషయాలు తెలు సుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందు తాయి. పనులు, బాధ్యతలు పురమాయించ వద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సమయానుకూలంగా మెలగండి. ప్రలోభా లకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయాలను సున్ని తంగా తెలియజేయండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక ఆహ్వానం సంతో షం కలిగిస్తుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. రావలసిన ధనం అందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వారితోమితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తా వన తగదు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఏజెంట్లు, ప్రకటనలను నమ్మ వద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ అభిప్రాయలకు స్పందన లభిస్తుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అన్ని రంగాల వారికీ అను కూలమే. మీ వాక్కు ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయులను విందులకు ఆహ్వాని స్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూర వుతాయి. పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. పట్టుదలతోనే లక్ష్యం సాధిస్తారు. పెద్దఖర్చు తగిలే సూచన లున్నాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగి స్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియ జేయండి. దూరప్రయాణం తలపెడతారు.