ఈ వారంలో మీ రాశిఫలం ఎలా ఉందంటే...
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:55 AM
ఆ రాశివారు ఈ వారం కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని, అవిశ్రాంతంగా శ్రమిస్తారని, మీ కృషి ఫలిస్తుందని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..

అనుగ్రహం
1 - 7 జూన్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
అనుకూలతలు నెలకొంటాయి. ప్రతికూలతలకు దీటుగా స్పందిస్తారు. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వ్యూహా త్మకంగా అడుగులేస్తారు. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. అన వసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాయిదాల చెల్లిం పులో జాప్యం తగదు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
గ్రహసంచారం సామాన్యంగా ఉంది. కార్యసిద్థికి ఓర్పు ప్రధానం. ఉత్సాహం తగ్గకుండా శ్రమించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శిం చవద్దు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సామరస్యంగా మెలగండి. కీలక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ప్రయాణం విరమించుకుంటారు. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడతుంది. అతిగా ఆలో చించొద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ధనం మితంగా వ్యయం చేయండి. మీ భాగ్యస్వామి సాయంతో ఒక అవసరం నెరవేరుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. తల పెట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు సానుకూలమవు తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపు తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్తవ్యక్తులతో మితంగా సంభా షించండి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు విజయ వంతంగా సాగుతాయి. ఆర్థికంగా బాగుం టుంది. ఆపన్నులకు సాయం చేస్తారు. ప్రము ఖులతో పరిచయాలు బలపడతాయి. సావకా శంగా పనులు పూర్తి చేస్తారు. పొగిడే వారితో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. ఒత్తిడికి గురికావొద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో తరుచుగా సంభాషిస్తుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ఈ వారం అనుకూలదా యకం. మీ కష్టం ఫలిస్తుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించు కుంటారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరు స్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
గ్రహబలం ప్రతికూలంగా ఉంది.. అవకాశాలు అందినట్టే అంది చేజారి పోతాయి. చిన్న విషయానికే చికాకు పడుతుంటారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచించొద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు అప్పగించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
రావలసిన ధనం సమయానికి అందుతుంది. రుణవిముక్తులవుతారు.ఖర్చులు సామాన్యం. కొత్త పనులు చేపడతారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రముఖులతో సమస్యలు తలెత్తకుండా మెలగండి. మీ సమస్యను ఆప్తులకు తెలియ జేయండి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లవద్దు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుం టారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. విలాసాలకు విపరీ తంగా ఖర్చుచేస్తారు. బుధవారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు ధనం అందుకుం టారు. ఖర్చులు అదుపులో ఉండవు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పత్రాల రెన్యు వల్లో జాప్యం తగదు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. ప్రయాణం కలిసివస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీదైన రంగంలో పురోగ మిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
Read Latest Telangana News and National News