ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారు...
ABN , Publish Date - Jun 15 , 2025 | 07:43 AM
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారని, అలాగే వచ్చిన అభియోగాలు తొలగిపోగలవని, వ్యక్తిత్వమే వారిని కాపాడుతుందని, కొత్త పనులు చేపడతారని తెలుపుతున్నారు.

అనుగ్రహం
15 - 21 జూన్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. అన్నివిధాలా ప్రోత్సాహకరం. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ చిత్తశుద్థి ప్రశంసనీ యమవుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. మీ వ్యక్తిత్వమే మిమ్ములను కాపాడుతుంది. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. లావాదేవీ లతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. కొన్ని ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దలను సంప్రదించండి. మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు అధికం, నగదు డ్రా చేేసటపుడు జాగ్రత్త. ప్రతీ విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. అనుమానాలు, అపోహలకు తావివ్వ వద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. మీ పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూ లంగా ఉంది. లక్ష్యం సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా శ్రమించండి. యత్నాలను సన్ని హితులు ప్రోత్సహిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్ళకు గురికా వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అనవసర జోక్యం తగదు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతుల వుతారు. దూరపు బంధుత్వాలు బలపడ తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం చేస్తారు. తలపెట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయసేకరణకు కొందరు యత్నిస్తారు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
లక్ష్యసాధనకు మరింత శ్రమిం చాలి. ఇబ్బందులెదురైనా యత్నాలు సాగించండి. మనోధైర్యంతో శ్రమిేస్త విజయం తఽథ్యం. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుం టారు. వృఽథా ఖర్చులు తగ్గించుకుంటారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియ జేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. మీరు తీసుకునే నిర్ణయంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆటంకాలెదురైనా యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలి స్తుంది. ధనసహాయం అర్థించేందుకు మన స్కరించదు. అవసరాలు ఏదో విధంగా నెర వేరుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభా షిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కని పించవు. చిన్నవిషయానికే చికాకుపడతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
సమయస్ఫూర్తితో వ్యవహరి స్తారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆటుపోట్లు ఎదురైనాలక్ష్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కష్టం వృథా కాదు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్ననాటి పరిచ యస్తులను కలుసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందు కేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుం టారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు.