Share News

Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

ABN , Publish Date - Nov 24 , 2025 | 02:51 PM

సుబ్రహ్మణ్య షష్ఠికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్యణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనం నిర్వహిస్తారు.

Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు.. సుబ్రహ్మణ్య షష్ఠిని భక్తులు జరుపుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున భక్తి శ్రద్ధతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే.. కోరికలు నెరవేరతాయని అంటారు. ముఖ్యంగా పిల్లలు కావాలనే వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది? అంటే..

నవంబర్ 25వ తేదీ అంటే మంగళవారం.. సాయంత్రం 6.56 గంటలకు షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 26వ తేదీ.. బుధవారం రాత్రి 7.14 గంటలకు ఈ తిథి వెళ్లిపోతుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం పండగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు. పంచమి రోజు.. ఉపవాసం ఉండి షష్ఠి నాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయిని పండితులు చెబుతారు.


ఈ రోజు స్వామి వారిని పూజిస్తే..

జ్ఞానం, బుద్ధి వృద్ధి, కుజ దోషం నివారణ, సంతానం కలుగుతుంది. చర్మ వ్యాధులు నయమవుతాయని అంటారు.


ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏం చేయాలి?

సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. అనంతరం పాలతో కలిపి ఉండే.. పంచామృతం, పాయసం ప్రసాదంగా పెట్టాలి. వడపప్పు, చలిమిడిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలని పండితులు పేర్కొంటున్నారు.

ఈ రోజు.. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలోని నాగ పడగలకు పాలు పోయాలి. అలాగే నాగేంద్రస్వామి వారి పుట్ట ఉంటే.. పాలు పోయాలి.

సర్ప దోషం ఉన్న వారు ఈ రోజు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి.

పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహు, కేతు దోషాల నుంచి బయటపడవచ్చు.

వివాహం కుదరక పోయినా.. బాగా ఆలస్యం అవుతున్నా.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి.

సంతానం కావాలని కోరుకునే వారు.. ఈ రోజు స్వామి వారికి పంచామృతంతో అభిషేకం చేయాలి.


ఈ రోజు ఇలా చేయండి..

తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో మరి ముఖ్యంగా శివాలయాల్లో.. రావి చెట్టు కింద జంట నాగలు ఉంటాయి.

తొలుత మంచి నీటితో జంట నాగులను శుభ్రం చేయాలి.

పసుపును జంట నాగుల పడగలకు రాయాలి. నాగ పడగల శిరస్సులపై పసుపు కుంకుమలు చల్లాలి.

నాగ పడిగల పాదాలు వద్ద, తలపై పూలు పెట్టాలి. (తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి).

నైవేద్యంగా స్వామి వారికి తాంబులం ఆకులు సమర్పించారు.

స్వామి వారికి ఆవునెయ్యితో దీపం పెట్టి.. ఆగరబత్తుల వెలిగించాలి.

చివరగా స్వామి వారికి హారతి ఇచ్చి.. కళ్లకు అద్దుకోవాలి.

స్వామి వారికి నమస్కరించి.. మన మనస్సులోని కోరికలు చెప్పుకోవాలి.

ఒక వేళ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలు ఉంటే.. స్వామి వారికి అభిషేకం చేయించాలి. స్వామి వారి దేవాలయం లేకుంటే.. మాత్రం రావి చెట్టు లేదా వేప చెట్టు కింద ఉండే నాగ పడగలకు పూజలు చేయాలి.


మోపిదేవి, సింగరాయపాలెం..

సుబ్రహ్మణ్య షష్ఠి రోజు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్యణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సైతం ఈ దేవాలయాలకు భక్తులు తరలి వస్తారు. ఇక సింగరాయపాలెంలో షష్టి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నవంబర్ 26వ తేదీన షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవి డిసెంబర్ 6వ తేదీతో ముగుస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

చరిత్రాత్మక ‘స్కంధ’ పుష్కరిణి..

విఘ్నేశ్వరుడికి గజరాజు పూజలు...

For More Devotional News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 04:45 PM