Naga Panchami 2025: నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:45 PM
ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి జులై 29వ తేదీ.. అంటే మంగళవారం వచ్చింది. ఈ రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి) వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

శ్రావణ మాసం అంటేనే శుభకరం.. మంగళకరం. అలాంటి మాసంలో పర్వదినాలు చాలా ఉన్నాయి. ఈ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి జులై 29వ తేదీ.. అంటే మంగళవారం వచ్చింది. ఈ రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి) వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అదీకాక మంగళవారం అంటేనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు.
దీంతో మంగళవారం నాడే నాగపంచమి కూడా రావడంతో.. ఆ స్వామి వారిని పూజించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నాగేంద్ర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. అదికాక హిందూ మతంలో పాములను దైవంగా ఆరాధిస్తారు.
ఈ రోజు ఇలా చేయండి..
తెల్లవారుజామునే లేచి.. తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి.. మీ ఇంటికి సమీపంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి దేవాలయానికి వెళ్లి ఆవు పాలతో అభిషేకం చేయించండి. ఈ రోజు సాత్విక ఆహారం తీసుకోండి. ఒంటి పూట భోజనం చేయండి. రాత్రికి చాపపై నిద్రించండి.
లేకుంటే శివాలయాల్లో రావి చెట్టు కింద జంట నాగులకు మంచి నీటితో శుభ్రం చేయండి. అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయండి. (విగ్రహాలు మొత్తం తడిచే విధంగా ఆవు పాలు పోయాలి). అనంతరం పసుపు కుంకుమలతోపాటు ఎర్రని పూలతో పూజించండి. అవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆగరబత్తులు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. చివరకు స్వామి వారికి హారతి ఇచ్చి.. నమస్కరించి.. మన మనస్సులోని కోరికలు తెలపాలి.
ఈ మంత్రాన్ని..
ఓం భుజంగేశాయ విద్మహే.. సర్పరాజాయ ధీమహి.. తన్నో ముక్తి నాగ: ప్రచోదయాత్ (ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు పఠించండి).
ఈ రోజు 12 రాశుల వారు.. ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు.
మేష రాశి: ఈ రాశి వారు శివునికి రుద్రాభిషేకం చేయాలి. దీని వల్ల మేలు జరుగుతుంది. మహా శివుని అనుగ్రహంతో కష్టాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి: ఈ రాశివారు ఒక వెండి నాణేన్ని ప్రవహించే నదిలో వదలాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారు పెసరపప్పు దానం చేయాలి. శివుడిని పూజించి.. ఉపవాసం ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి: ఈ రోజు ప్రవహించే నీటిలో కొబ్బరికాయ వదలాలి. మహాశివునికి జలాభిషేకం చేయాలి. అలా చేయడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
సింహ రాశి: ఈ రోజు అవసరంలో ఉన్నవారికి ఎండు కొబ్బరికాయను దానం చేయాలి. అలాగే ఆలయంలో శివునికి జలాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కన్య రాశి: ఈ రోజు శివునికి జలాభిషేకం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయాలి. తద్వారా ఆరోగ్య సమస్యలు తీరిపోయి మేలు జరుగుతుంది.
తులా రాశి: ఈ రోజు శివాలయంలో శివుని చాలీసా పఠించడం మంచిది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. వస్త్రాలు లేదా ధనం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రోజు శివునితోపాటు వినాయకుడిని పూజించాలి. వారికి పసుపు లడ్డూ నైవేద్యంగా పెట్టాలి. పువ్వులను సమర్పించాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తోంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు శివునికి పిండి, చక్కెర మిశ్రమంతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. దేవునికి నైవేద్యం పెట్టి అనంతరం ఆ స్వీట్లను భక్తులకు పంచాలి. దీని వల్ల పాపాలు నశిస్తాయి.
మకర రాశి: ఈ రోజు.. మహా శివుడికి నల్ల నువ్వులు సమర్పించాలి. భక్తులకు అన్నదానం చేయడం శ్రేయస్కరం.
కుంభ రాశి: ఈ రోజు శివుడిని, నాగ దేవతను పూజించడంతో పాటు 'ఓం నాగదేవతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల కాల సర్ప దోషం తొలగిపోతుంది.
మీన రాశి: ఈ రాశి వారు.. ఈ రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలు దూరమవుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..