Share News

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది..

ABN , Publish Date - Apr 27 , 2025 | 08:45 AM

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. లావాదేవీల్లో ఏకాగ్రత వహించాలని, ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయని తెలుపుతున్నారు. ఇక.. పనులు సావకాశంగా పూర్తి చేస్తారని, కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయంటూ పండితులు తెలుపుతున్నారు.

ఆ రాశివారికి ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది..

అనుగ్రహం

27 ఏప్రిల్‌ - 3 మే 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచిం చండి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాం తంగా ఉంటుంది. కొత్త పరిచయాలు బలపడ తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వివాదాలు పరిష్కారమవుతాయి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

ఆర్థికంగా మంచి ఫలితాలు న్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచ నలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సోమవారం నాడు పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెటీవ్‌లను ఆశ్రయిం చవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. మంగ ళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయం గా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. సోద రుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

కార్యం సిద్ధిస్తుంది. సంప్రదిం పులు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసు కుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అధికం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

ఈ వారం అనుకూలదాయకం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సామరస్యంగా మెలగండి. ఆత్మీ యులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవ రణలు సాధ్యమవుతాయి. మీ అభిప్రాయా లను స్పష్టంగా తెలియజేయండి.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ప్రముఖులతో పరిచయాలేర్ప డతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగు తాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధి కం. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆరోగ్యం కుదుటపడుతుంది.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

పట్టుదలతో శ్రమిేస్త్తనే పనులు సానుకూలమవుతాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అంచనాలను మించు తాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ధనసహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్థతను గుర్తి స్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కొత్త యత్నాలు మొదలెడ తారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం వెంటనే ఫలిస్తుంది. అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టు కుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమా నం కలుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

విశేషమైన ఫలితాలున్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గిం చుకుంటారు. ఇంటి విషయాలు పట్టించు కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా అడుగు ముందుకేస్తారు. కీలక విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పిల్లల విజయం ఉత్సాహపరుస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్‌ బాధితుడు

జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 27 , 2025 | 08:45 AM