Share News

female harassment: ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా.. మగబిడ్డ కోసం మామ, బావతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి..

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:37 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మగబిడ్డ కోసం భర్తే భార్యను వేరొకరితో అఫైర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేసిన ఘటన చాలా మందిని నివ్వెరపరుస్తోంది. అబ్బాయి కావాలనే కోరికతో అత్తింటివారు ఓ మహిళపై దారుణాలకు పాల్పడ్డారు. ముందుగా ఆమెకు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు.

female harassment: ఛీ.. ఛీ.. వీడసలు భర్తేనా.. మగబిడ్డ కోసం మామ, బావతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి..
domestic abuse

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మగబిడ్డ కోసం భర్తే భార్యను వేరొకరితో అఫైర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేసిన ఘటన చాలా మందిని నివ్వెరపరుస్తోంది. అబ్బాయి కావాలనే కోరికతో అత్తింటివారు ఓ మహిళపై దారుణాలకు పాల్పడ్డారు. ముందుగా ఆమెకు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు. అలాగే అబ్బాయి కోసం మూఢ నమ్మకాన్ని కూడా ఫాలో అయి అనైతిక బంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు (gender discrimination).


మెహక్ ఖాన్ అనే మహిళ 2021లో ఫహీద్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. అత్తింట్లోకి అడుగుపెట్టగానే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. కారుతో పాటు లక్షల రూపాయల కట్నం తేవాలని భర్త, అతడి కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. కట్నం తీసుకురాలేకపోవడంతో ఆమెను భర్త, అతడి కుటుంబసభ్యులు శారీరకంగా హింసించారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరోసారి గర్భం దాల్చినపుడు కడుపులోని బిడ్డ లింగ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారు. ఆ స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించారు. ఆ తర్వాత మరోసారి కూడా ఆడబిడ్డ అని తెలియడంతో మళ్లీ అబార్షన్ చేయించారు (domestic abuse).


మగబిడ్డ కావాలనే విపరీతమైన కోరికతో భర్త, అత్తామామలు మరింత దారుణానికి ఒడిగట్టారు (Uttar Pradesh case). మామ, లేదా బావతో లైంగిక సంబంధం పెట్టుకుని మగబిడ్డను కనాలని మెహక్ ఖాన్‌ను ఆమె భర్త, అత్త, ఆడపడుచులు తీవ్రంగా వేధించారు. కొద్ది రోజుల క్రితం మెహక్‌ ఖాన్‌ను, ఆమె కూతురిని అత్తింటివారు దారుణంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు మెహక్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త, అత్త, బావ, ఆడపడుచులతో సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొని దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 26 , 2025 | 07:37 PM