అయ్యోపాపం.. ఎంతఘోరం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:56 AM
మద్యం సేవించి ఇంటికొచ్చిన కుమారులను తల్లి మందలించడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మవారపాళయం గ్రామానికి చెందిన జయలక్ష్మి, పెద్ద కుమారుడు విఘ్నేష్ (28), చిన్న కుమారుడు గణేష్ (24) శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు.

- తల్లి మందలించడంతో అన్నదమ్ముల ఆత్మహత్య
చెన్నై: మద్యం సేవించి ఇంటికొచ్చిన కుమారులను తల్లి మందలించడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మవారపాళయం(Kannavarapalayam) గ్రామానికి చెందిన జయలక్ష్మి, పెద్ద కుమారుడు విఘ్నేష్ (28), చిన్న కుమారుడు గణేష్ (24) శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. అదే కర్మాగారంలో పనిచేస్తున్న యువతిని గణేష్ ప్రేమిస్తుండడంతో తల్లి ఖండిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో, బుధవారం రాత్రి విఘ్నేష్, గణేష్ మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి ఇద్దర్నీ మందలించింది. తల్లి మందలింపుతో మనస్తాపం చెందిన ఇద్దరూ, ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దిగ్ర్భాంతి చెందిన జయలక్ష్మి(Jayalaxmi), చుట్టుపక్కల వారి సాయంతో పోరూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స ఫలించక గురువారం ఉదయం గణేష్, రాత్రి విఘ్నే్‌ష మృతిచెందారు. ఈ ఘటనపై మనవాళనగర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News