Bhadradri Kothagudem: ఉపాధినివ్వాల్సిన వల.. ఊపిరి తీసింది.. చేపలు పడుతుండగా.. సడన్‌గా....
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:48 PM
చేపల కోసం వేసిన వలే అతడికి యమపాశమైంది. వలలో చిక్కి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్‌ప్రకాష్(25) శుక్రవారం కొందరు గ్రామస్థులతో కలిసి ఆళ్లపల్లి మండలం అనంతోగు వద్ద కిన్నెరసాని వాగులో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం మడుగులో చేపలు పట్టేందుకు వెళ్లారు.

వలలో చిక్కుకుని.. నీట మునిగి యువకుడి మృతి
ఆళ్లపల్లి మండలం అనంతోగులో ఘటన
ఆళ్లపల్లి(భద్రాద్రి కొత్తగూడెం): చేపల కోసం వేసిన వలే అతడికి యమపాశమైంది. వలలో చిక్కి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్‌ప్రకాష్(25) శుక్రవారం కొందరు గ్రామస్థులతో కలిసి ఆళ్లపల్లి(Allapally) మండలం అనంతోగు వద్ద కిన్నెరసాని వాగులో ఇటీవల నిర్మించిన చెక్‌డ్యాం మడుగులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో చేపల కోసం విసిరిన వలలో ప్రవీణ్‌ప్రకాష్ చిక్కుకుని నీట మునిగాడు. మడుగు లోతుగా ఉండడంతో పాటు విరిగిన పెద్దపెద్ద చెట్ల మొదళ్లు ఉండటంతో వలలో చిక్కుకున్న అతను ఎంతకీ బయటకు రాలేకపోయాడు. అతనికి తోడుగా వచ్చినవారు నీటలో దిగి వెలికితీసే సరికి ప్రవీణ్‌ప్రకాష్ మృతి చెందినట్లు తెలిపారు. అతని మృతదేహాన్ని స్వగ్రామం మామకన్నుకు తరలించారు. ప్రవీణ్‌ప్రకాష్‌కు భార్య, ఆరునెలల కుమారుడు ఉన్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News