Share News

Elephant: అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో..

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:40 PM

అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ కన్నుమూసింది. నీలగిరి జిల్లాలో సరసు (58) అనే మహిళపై అడవి ఏనుగు గత బుధవారం దాడిచేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కాగా.. చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో వారి కుటుంంలో విషాదం నెలకొంది.

Elephant: అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో..

- ఏనుగుదాడిలో గాయపడిన మహిళ మృతి

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా మసినకుడి వద్ద అడవి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరసు (58) అనే మహిళ బుధవారం ఉదయం మృతి చెందింది. సోమవారం సాయంత్రం సరసు, ఆమె భర్త బైకులో పొక్కాపురం మారియమ్మన్‌ గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా మసినకుడి రహదారిలో సంచరిస్తున్న అడవి ఏనుగు(Wild elephant) దాడి చేసింది. బైకును తొండటంతో నెట్టిపడేయటంతో భార్యాభర్తలిద్దరూ దూరంగా రోడ్డుపై పడ్డారు. ఈ సంఘటనలో సరసకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధశారం ఉదయం ఆమె మృతి చెందారు.

ఈ వార్తను కూడా చదవండి: Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు


nani3.jpg

ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..


city8.2.jpg

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 12:40 PM