Share News

Chennai News: అనుమానం పెనుభూతమై.. పిల్లలను చంపి కార్మికుడి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:45 AM

అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Chennai News: అనుమానం పెనుభూతమై.. పిల్లలను చంపి కార్మికుడి ఆత్మహత్య

చెన్నై: అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా వున్నాయి... తెల్లూరుకు చెందిన కృష్ణన్‌ (44), పూంగొడి దంపతులకు కుమార్తె కయల్‌విళి (9), కుమారుడు నిదర్శన్‌ (7) ఉన్నారు. కృష్ణన్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కృష్ణన్‌ కుటుంబంతో కలిసి చెన్నైలో కాపురముండేవాడు.


అప్పట్లో భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతుండేవాడు. ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీనితో పూంగొడి పుట్టింటికి వెళ్ళిపోయింది. పిల్లలు కృష్ణన్‌ వద్దే ఉండేవారు. ఇటీవల దీపావళి సందర్భంగా కృష్ణన్‌ తన స్వగ్రామం తెల్లూరుకు పిల్లలను తీసుకెళ్లాడు. దీపావళి గడిచినా అతడు చెన్నై(Chennai) తిరిగి వెళ్లలేదు. భార్య విడిచిపెట్టిందన్న కోపంతో రోజూ తాగి ఇంటికి చేరుకునేవాడు. ఈ నేపథ్యంలో గురువారం పగలంతా పనులకు వెళ్ళిన కృష్ణన్‌.. పక్కింటిలో ఆడుకుంటున్న తన పిలలలను ఇంటికి పిలిచాడు.


nani4.2.jpg

రాత్రి పిల్లలిద్దరూ నిద్రపోగా, పీకలదాకా మద్యం తాగి ఉన్న కృష్ణన్‌ నిద్రపోతున్న పిల్లలను గొంతు నులిమి హతమార్చి, ఆ తర్వాత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కృష్ణన్‌ ఇంటి నుండి ఎలాంటి అలికిడి వినిపించకపోవటంతో చుట్టుపక్క వారి ఇంటిలోపలకు వెళ్ళి చూడగా కృష్ణన్‌ శవంగా వేలాడుతుండటం, నేలపై ఇద్దరు పిల్లల మృతదేహాలు ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేత్తుపట్టు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 01 , 2025 | 11:48 AM