Google Pay: చేతబడి చేయాలంటూ జీ పే ద్వారా రూ.21 లక్షలు చెల్లింపు..
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:30 PM
చేతబడి చేసి హతమార్చాలంటూ గూగుల్ పే(Google Pay) ద్వారా రూ.21 లక్షలు పంపిన వ్యవహారంలో మాంత్రికుడి సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ స్వస్థలం కలిగిన రఘు, ప్రస్తుతం చెన్నై(Chennai)లో మాంత్రికుడుగా చెలామణి అవుతున్నాడు.

- మాంత్రికుడి సహా ఇద్దరు అరెస్ట్
చెన్నై: చేతబడి చేసి హతమార్చాలంటూ గూగుల్ పే(Google Pay) ద్వారా రూ.21 లక్షలు పంపిన వ్యవహారంలో మాంత్రికుడి సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ స్వస్థలం కలిగిన రఘు, ప్రస్తుతం చెన్నై(Chennai)లో మాంత్రికుడుగా చెలామణి అవుతున్నాడు. అలాగే, యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో మంత్రాల గురించి వీడియోలు చేస్తుంటారు. అలా, అతని సాయం కోరిన వారి నుంచి గూగుల్ పే ద్వారా నగదు వసూలుచేస్తుంటాడని ఆరోపణలున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: WhatsApp group: రైళ్లలో మహిళల భద్రతకు ‘వాట్సాప్ గ్రూప్’
ఈ నేపథ్యంలో, పెరంబలూరు దురైమంగళం ప్రాంతానికి చెందిన రమేష్కృష్ణ(Ramesh Krishna), అదే ప్రాంతానికి చెందిన సిబి అనే మురసోలి మారన్ అనే వ్యక్తిని చేతబడి చేసి హతమార్చాలని సుమారు రూ.21 లక్షలు గూగుల్ పే ద్వారా రఘుకు పంపినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సిబి, పెరంబలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, రఘు, రమేష్కృష్ణలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News