Chennai: ఏసీ కావాలంటూ నవ వధువుకు వేధింపులు.. - పెళ్ళయిన నాలుగో రోజే ఆత్మహత్య
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:53 AM
కాళ్ల పారాణి ఆరకముందే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కేవలం ఏసీ కోసం ఆమెను వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా... తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం ముస్లిం నగర్ ఏరికరై ప్రాంతానికి చెందిన లోకేశ్వరి (22) బీఏ పూర్తిచేసింది.

- పెళ్ళయిన నాలుగో రోజే ఆత్మహత్య
చెన్నై: కాళ్ల పారాణి ఆరకముందే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కేవలం ఏసీ కోసం ఆమెను వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా... తిరువళ్లూర్(Tiruvallur) జిల్లా పొన్నేరి సమీపం ముస్లిం నగర్ ఏరికరై ప్రాంతానికి చెందిన లోకేశ్వరి (22) బీఏ పూర్తిచేసింది. ఆమెకు పొన్నేరి సమీపం కాట్టావూరు ప్రాంతానికి చెందిన పన్నీర్ (30)తో గత నెల 27వ తేది వివాహం జరిగింది. వివాహం అనంతరం లోకేశ్వరి(Lokeshwari) సోమవారం భర్తతో కలసి పుట్టింటికి వచ్చింంది.
రాత్రి భోజనాలు చేసి అనంతరం అందరూ నిద్రపోతున్న సమయంలో లోకేశ్వరి బాత్రూమ్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో తండ్రి గజేంద్రన్ బాత్రూమ్ తలుపు తట్టినా ఎలాంటి శబ్దం రాలేదు. తలుపు నెట్టుకుంటూ లోనికి వెళ్లిన గజేంద్రన్, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుమార్తెను చూసి బోరున విలపించాడు. ఈ వ్యవహారంపై మృతురాలి తండ్రి గజేంద్రన్ పొన్నేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తన కుమార్తెకు గత నెల 27వ తేది వివాహం జరుగగా, కట్నం కింద 4 సవర్ల నగలు, బైక్, రూ.1.50 లక్షల విలువైన గృహోపకరణాలు అందించామన్నారు.
వివాహం జరిగిన రోజు నుంచి తమ కుమార్తెపై వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ముందు తెలిపిన విధంగా మిగిలిన సవర నగలు, ఏసీ, మరికొన్ని గృహోకరణాలు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని ఇంటికొచ్చిన కుమార్తెతో తనతో తెలిపి విలపించిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్యకు పన్నీర్, అతని కుటుంబసభ్యులు కారణమని పిటిషన్‌లో తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, పన్నీర్, అతని కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి
Read Latest Telangana News and National News