Chennai: వివాహేతర సంబంధానికి అడ్డమైందని..
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:48 PM
రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ ఉదహారణ. నవమాసాలు మోసి, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే తన ‘ఆ’ కార్యకలాపాలకు అడ్డొస్తోందని భావించి మద్యం తాగించి చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి మృతిచెందింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- ప్రియులతో కలిసి తల్లి దారుణం
- మద్యం తాగించి పడుకోబెట్టే యత్నం
- బాలిక మృతి
చెన్నై: తమ వివాహేతర సంబంధానికి అడ్డం వస్తోందని ఆగ్రహించిన ఓ తల్లి, ఆమె ముగ్గురు ప్రియులు రెండున్నరేళ్ల బాలికపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా చిన్నారికి మద్యం తాగించి పడుకోబెట్టేందుకు యత్నించారు. దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి మృతి చెందింది. తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి... దిసైవినై ద్వారంబట్టు ప్రాంతంలో శరత్, బృంద (25) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..
వేర్వేరు కులాలకు చెందిన వీరు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి దర్శిని (2) అనే కుమార్తె ఉంది. శరత్ కోవైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బృంద కొంతమంది యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గత బుధవారం రాత్రి లింగసెల్వం, ముత్తుచుడర్, బెంజమిన్ అనే ముగ్గురు యువకులు బృందాను, ఆమె కుమార్తె దర్శినిని వాళతొట్టమ్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత దర్శినిని రోడ్డు పక్కనే కూర్చోబెట్టి బృందాతో గడిపేందుకు వెళ్లారు.
ఆ సమయంలో చిన్నారి ఏడుస్తుండడంతో. తమకు అంతరాయం కలిగిస్తుందని ఆగ్రహించిన ముగ్గురు యువకులు, బృంద కలిసి ఆ చిన్నారి చేత బలవంతంగా మద్యం తాగించగా, కొద్దిసేపటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఇంత జరిగినా ఏ మాత్రం దిగులు చెందని బృంద మరుసటి రోజు తన కుమార్తె అనారోగ్యంతో మృతి చెందినట్లు నాటకమాడింది. భర్త, కుటుంబీకులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బృందాను, ఆమె సన్నిహితులను తమదైన శైలిలో విచారించడంతో అసలు గుట్టురట్టయ్యింది. దీంతో ఆ నలుగురినీ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా
మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
Read Latest Telangana News and National News