సూళ్లూరుపేటలో అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్..
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:09 PM
సూళ్లూరుపేటలో ఓవ్యక్తి అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్ చేసిన సంఘటన ఇది. పక్కింట్లో ఉంటున్న దంపతులపై దాడికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పారిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చే. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- ప్రత్యర్థులు తప్పించుకోవంతో ఇంటి నిర్మాణ గోడలను కూల్చివేసిన వైనం
- ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు
సూళ్లూరుపేట(అమరావతి): సూళ్లూరుపేట(Sullurupet) మండలం కొరిడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మారణాయుధాలతో పక్కింట్లో ఉంటున్న దంపతులపై దాడికి ప్రయత్నించగా, వారు తప్పించుకుని పారిపోయారు. దీంతో బాధితులు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి గోడలను కూల్చివేసిన ఘటన బుధవారం అర్థరాత్రి చోటుచేసుకొంది. స్థానికల సమాచారం మేరకు... కొరిడి దళితవాడకు చెందిన కిలివేటి మణి, కిష్టమ్మ కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: వేసవిలో విద్యుత్ కోతలుండవ్..
వారింటి పక్కనే నివాసం ఉంటున్న కిలివేటి రవిచంద్ర బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కత్తి, గడ్డపారతో మణి ఇంటికెళ్లి నీ భర్త ఎక్కడంటూ కిష్టమ్మ ప్రశ్నిస్తూ హల్‌చల్ చేశాడు. ఒంటరిగా ఉన్న కిష్టమ్మ భయంతో భర్తకు ఫోన్ చేయడంతో మణి ఇంటి వద్దకు చేరుకోగా రవిచంద్ర దాడికి ప్రయత్నించాడు. దీంతో మణి, ఆయన భార్య కిష్టమ్మ తప్పించుకుని పారిపోయారు. దీంతో వారు కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గోడలను రవిచంద్ర కూల్చివేశాడు.
రాత్రి సమయం కావడం, చేతిలో కత్తి, గడ్డపార ఉండడంతో ఇరుగుపొరుగువారు భయంతో మిన్నకుండిపోయారు. ఘటన జరిగిన అనంతరం బాధితులు శ్రీహరికోట పోలీసులకు సమాచారం అందించారు. గురువారం పోలీసులు కొరిడి గ్రామానికి వెళ్లి కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు. జరిగిన ఘటనపై కిష్టమ్మ శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితులు, నిందితుడు బంధువులు పిలిపించి విచారిస్తామని పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News