Share News

Hyderabad: నా కోరిక తీర్చు... లేదంటే కుటుంబంపై యాసిడ్‌ పోస్తా

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:01 AM

మానవ సంబంధాలు ఎలా మంటగలిసిపోతున్నాయో ఇక్కడ జరిగిన ఓ సంఘటనే తాజా ఉదహారణ. సోదరుడు వరసయ్యే వ్యక్తే ఓ మహిళను తన కోరిక తీర్చాలని, లేకుంటే యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: నా కోరిక తీర్చు... లేదంటే కుటుంబంపై యాసిడ్‌ పోస్తా

- సోదరుడి వరసయ్యే వ్యక్తి నుంచి వివాహితకు వేధింపులు

హైదరాబాద్: ‘నా కోరిక తీర్చు... లేకుంటే నీ కుటుంబంపై యాసిడ్‌ పోస్తా’ అని వరుసకు సోదరుడయ్యే వ్యక్తి.. వివాహితను బెదిరిస్తున్నాడు. అప్పటికే అతడి వేధింపులతో విసిగి పోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. నందగిరిహిల్స్‌లో నివసించే ఓ వివాహిత హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పలాస టు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్‌


2017లో శివరాంతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదే బస్తీలో శివరాం బంధువు.. ఆటో డ్రైవర్‌ నవీన్‌ కూడా నివాసముంటున్నాడు. వరసకు నవీన్‌ సోదరుడు కావడంతో శిరీష పలుకరించేది. అతనూ రోజూ వారింటికి వచ్చిపోతుంటాడు. ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని వివాహిత వెంట పడ్డాడు. వేధింపులు పెరిగిపోవడంతో రెండు నెలల క్రితం భర్తకు విషయం చెప్పింది.


city5.2.jpg

అప్పటి నుంచి నవీన్‌ ఫోన్‌ చేయడం, ఇంటికి రావడం మానేశాడు. ఈనెల 26న ఆమెకు ఫోన్‌ చేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఆమె పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి ఇష్టానుసారంగా దుర్భషలాడటంతో పాటు తన కోరిక తీర్చకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2025 | 10:01 AM