Share News

Hyderabad: ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:06 AM

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్‌ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.

Hyderabad: ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

  • రూ.2.60 లక్షలు స్వాహా

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌(Online)లో అవకాడోలు బుక్‌ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్‌ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టారు. నగరానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఆన్‌లైన్‌లో అవకాడోల కోసం వెదుకుతుండగా, డోర్‌ డెలివరీ చేస్తామంటూ విజయవాడ(Vijayawada)కు చెందిన బాలాజీ ట్రేడర్స్‌ పేరుతో ఓ వ్యక్తి లైన్‌లోకి వచ్చి ఆర్డర్‌ తీసుకున్నాడు. మర్నాడు ఫోన్‌ చేసి డెలివరీ వాహనం చెడిపోయిందని, మీ అడ్రస్‌కు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నామని, మరమ్మతుల కోసం కొంత డబ్బు పంపితే అక్కడికి వచ్చి చెల్లిస్తామన్నారు. నమ్మకం కోసం ఫొటోను పంపారు. దాంతో బాధితుడు కొంత నగదు పంపాడు.

ఈ వార్తను కూడా చదవండి: Uttam: ఎన్‌డీఎస్‌ఏ నివేదికతో ప్రజల ముందు దోషిగా బీఆర్‌ఎస్‌!


city1.2.jpg

ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసిన క్రిమినల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనం ఆపారని, వారి నుంచి విడిపించుకోవడానికి కొంత డబ్బు పంపాలని కోరారు. బాధితుడు మరికొంత నగదు పంపాడు. ఇలా రకరకాల కారణాలతో విడతల వారీగా రూ.2.60లక్షలు ఖాతాలో వేయించుకున్నారు. అవకాడోలు డెలివరీ కాకపోగా, డబ్బులు తీసుకున్న వారి కాంటాక్ట్‌ కట్‌ అయింది. దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇదంతా సైబర్‌ మోసమని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 07:06 AM