Share News

Hyderabad: రెండు రోజులకో హత్య..

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:52 AM

మన హైదరాబాద్ బాగా డెవలప్ అయింది బాస్.. అన్న సినిమా డైలాగే ఏ ఉద్దేశంతో రాశారోగాని ఇప్పుడు దానిని గుర్తుకు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపక్క మహానగరమైన సిటీలో రెండు రోజులకో హత్య జరుగుతోంది. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే అయినా.. రోజురోజుకూ హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి.

Hyderabad: రెండు రోజులకో హత్య..

- గ్రేటర్‌లో కలకలం రేపుతున్న హత్యలు

- సోమవారం ఒక్కరోజే మూడు

- బౌద్ధనగర్‌లో బామ్మర్దిని చంపిన బావ

- దోమలగూడలో బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య

- అత్తాపూర్‌లో మేస్త్రీ?

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ పరిధిలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. గత రెండు నెలల పరిధిలోనే సుమారు 41 హత్యలు జరిగినట్లు (సరాసరిగా రెండు రోజులకో హత్య) పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. వరుస హత్యలు నగరవాసులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మార్చి నెలలో 15, ఏప్రిల్‌లో 26 హత్యలు జరిగాయి. సైబరాబాద్‌, రాచకొండ(Cyberabad, Rachakonda) శివారు జిల్లాలలో జరిగిన హత్యలు లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పెళ్లి చేసుకుని.. వ్యాపారికి ‘కోటి’ పంగనామాలు


ఇదిలాఉండగా, సోమవారం ఒక్కరోజే సైబరాబాద్‌, సిటీ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. అయినవాళ్లు.. రక్త సంబంధీకులే ఈ హత్యలకు పాల్పడుతుండడం తీవ్రంగా కలిచివేస్తోంది. మంచి నీళ్లు తాగినంత సులభంగా మర్డర్లు చేస్తుండడం కలకలం రేపుతోంది. తల్లికి సరైన గౌరవం దక్కడం లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, అనైతిక సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడితో కలిసి అక్కను, తల్లిని హత్య చేసిన కుమార్తె, డబ్బుల పంపకాల్లో మనస్పర్థలు వచ్చాయని స్నేహితుడిని, ఆస్తికోసం తండ్రిని కొడుకు.. ఇలా చంపుకుంటున్న ఘటనలు నగరంలో జరుగుతూనే ఉన్నాయి.


బామ్మర్దిని హత్య చేసిన బావ

పదిమందిలో పరువు తీయటంతో పాటు అనుమానిస్తున్నాడని బామ్మర్దిని ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసిన బావ సంఘటన వారాసిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముషీరాబాద్‌కు చెందిన రుక్కాల శ్యాంసన్‌రాజ్‌(38) పదేళ్ల క్రితం భార్యా పిల్లలను వదిలివేసి ఒంటరిగా నివసిస్తున్నాడు. చేపలమార్కెట్‌లో పనిచేయగా వచ్చిన డబ్బులతో నిత్యం తాగుతూ పార్సిగుట్టలో ఫుట్‌పాత్‌పై ఉండేవాడు. శ్యాంసన్‌రాజ్‌, బావ లూథరస్‌ ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. మద్యం మత్తులో శ్యాంసన్‌రాజు తన బావను పదిమందిలో అసభ్యంగా మాట్లాడి అనుమానించేవాడు.


city2,2.jpg

ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ మరికొందరితో కలిసి పార్శీగుట్ట చౌరస్తాలో ఓ పాడుపడిన ఇంటి మొదటి అంతస్తులో మద్యం తాగారు. ఈ క్రమంలో శ్యాంసన్‌రాజ్‌, లూథర్‌సను అవమానించాడు. దీన్ని భరించలేని లూథరస్‌ మద్యంమత్తులో గదిలో ఉన్న ఇనుపరాడ్‌తో శ్యాంసన్‌రాజు తలపై పలుమార్లు కొట్టడంతో అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత లూథరస్‌ ఇంటికి వెళ్లి పడుకున్నాడు. మద్యం తాగేందుకు పాడుబడిన ఇంట్లోకి కొందరు వెళ్లగా రక్తపు మడుగులో పడిఉన్న శ్యాంసన్‌రాజ్‌ మృతదేహం కనిపించింది.


వెంటనే వారు డయల్‌ 100కు కాల్‌ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పాడుపడిన ఇంట్లో మద్యం తాగిన వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమస్టైల్‌లో విచారించగా తానే హత్య చేసినట్లు లూథరస్‌ నేరం అంగీకరించాడు. సంఘటన స్థలాన్ని ఈస్ట్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీ నర్సయ్య, ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ రమేష్ గౌడ్‌ పరిశీలించారు.


అత్తాపూర్‌లో మేస్ర్తీ?

అత్తాపూర్‌ హుడా కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ మేస్ర్తీ అనుమానాస్పద మృతిచెందాడు. ఆదివారం రాత్రి కూలీలతో కలిసి మేస్త్రీ వెంకటేశ్వరరావు పడుకున్నాడు. తెల్లారేసరికి మృతిచెందాడు. అతడి మృతిపై అనుమానాలున్నాయని సోదరుడు శ్రీనివాస్‌ అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2025 | 07:52 AM