Hyderabad: వార్నీ.. ఏం ఐడియా.. కుక్కర్‌లో దాచి గంజాయి విక్రయం
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:46 AM
జైలులో పరిచయమైన గంజాయి విక్రేత సలహాతో గంజాయి విక్రయించిన నిందితుడితోపాటు అతడికి సహకరిస్తున్న పాత నేరస్థుడిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.630 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ ఆలంను హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

- ఇద్దరు నిందితుల అరెస్ట్
- 6.630 కిలోల సరుకు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: జైలులో పరిచయమైన గంజాయి విక్రేత సలహాతో గంజాయి విక్రయించిన నిందితుడితోపాటు అతడికి సహకరిస్తున్న పాత నేరస్థుడిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.630 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దమ్మాయిగూడ(Dammaiguda) ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ ఆలంను హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలులో విజయవాడకు చెందిన గంజాయి విక్రేత కాంపల్లి తిరుపతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ జైలు నుంచి మూడు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు.
తిరుపతి గంజాయి పంపుతుండగా.. మహబూబ్ ఆలం చిన్న ప్యాకెట్లలో పెట్టి పాత నేరస్థుడు నవాబ్‌ఖాన్‌తో విక్రయిస్తున్నాడు. అతడిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నవాబ్ ఖాన్‌పై జవహర్‌నగర్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అతడిని విచారించగా మహబూబ్ ఆలం నుంచి గంజాయి తీసుకొని విక్రయిస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు మహబూబ్ ఇంటిపై దాడిచేసి కుక్కర్, బ్యాగుల్లో దాచిన 6.40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
అడ్డా మార్చి అమ్మకం
ధూల్‌పేట్‌కు చెందిన విశాల్ సింగ్ గంజాయి దందా చేస్తున్నాడు. ధూల్‌పేటలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తుండడంతో అడ్డాను హైదర్‌గూడకు మార్చి గంజాయి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు విశాల్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 1.16 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News