Share News

Hyderabad: జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జాకు యత్నం.. సినీ నిర్మాతపై కేసు

ABN , Publish Date - Dec 03 , 2025 | 08:36 AM

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువూన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ సినీ నిర్మాత యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో స్థలం కబ్జాకు యత్నం.. సినీ నిర్మాతపై కేసు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లో విలువైన స్థలం కబ్జాకు యత్నించిన సినీ నిర్మాత(Film producer)పై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 70లో సర్వే నెంబరు 403 టీఎస్‌ నెంబరు 1, బ్లాక్‌ ఎఫ్‌, వార్డు 9లో ప్రభుత్వానికి చెందిన సుమారు 600 గజాల స్థలం ఉంది. తనిఖీల్లో భాగంగా రెవెన్యూ సిబ్బంది రెండు రోజుల క్రితం స్థలం దగ్గరకు వెళ్లగా అందులో కంటైయినర్‌ కనిపించింది. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలో కంటైనర్‌ చూసిన సిబ్బంది వెంటనే తహసీల్దార్‌ అనితారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


city4.2.jpg

విచారించగా సినీ నిర్మాత బషీద్‌ షేక్‌(Film producer Basheed Sheikh)తోపాటు మరికొంత మంది కంటైనర్‌ ఏర్పాటు చేసినట్టు తేలింది. రాయదుర్గం సర్వే నెంబరు 5కు చెందిన బోగస్‌ పత్రాలతో బషీద్‌షేక్‌ జూబ్లీహిల్స్‌లో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ తహసీల్దార్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 08:36 AM