Share News

Liquor : ఆహా.. ఏం ఐడియా గురూ.. ఖరీదైన బాటిళ్లలో కల్తీ మద్యం

ABN , Publish Date - Apr 26 , 2025 | 10:39 AM

ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఖరీదైన బ్రాండ్లలో కల్తీ మద్యాన్ని కలపడం ద్వారా ఎవరికీ అనుమానం రాదనుకున్నారేమోగాని వారి పాపం పండి చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Liquor : ఆహా.. ఏం ఐడియా గురూ.. ఖరీదైన బాటిళ్లలో కల్తీ మద్యం

- బార్‌లో కల్తీ మద్యం విక్రయాలు

- నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు

- రూ.1.48 లక్షల విలువైన 75 బాటిళ్ల కల్తీ మద్యం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: బార్‌లలో కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. బార్‌ ఓనర్‌, మేనేజర్‌ సహా వారి సహాయకుడిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.48 లక్షల విలువైన 75 బాటిళ్ల నకిలీ మద్యాన్ని, 55 ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో అయ్యప్ప సోసైటీ ప్రాంతంలో ట్రూప్స్‌ బార్‌ను రెన్యువల్‌ చేయలేదు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఓదేల-2లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలి


ఫీజు కూడా చెల్లించలేదు. కానీ బార్‌ నడుస్తున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో రంగారెడ్డి ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి బార్‌లోకి వెళ్లారు. బార్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, హెల్పర్‌ పునిత్‌ పట్నాయక్‌ కలిసి ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్‌ తీసి తక్కువ ధర కలిగిన మద్యాన్ని నింపుతుండగా అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

city6.2.jpg


మద్యం షాపుల్లో కొనుగోలు చేసి..

రూ.2,690 ధర కలిగిన జెమ్‌సన్‌ బాటిల్‌లో రూ. 1000 ధర కలిగిన ఓక్స్‌మిత్‌ మద్యాన్ని కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. బార్‌లో తనిఖీలు చేసి 75 బాటిళ్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 1.48లక్షలు ఉంటుందని వెల్లడించారు. కాగా.. మరో 55 ఖాళీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. బార్‌ను రెన్వువల్‌ చేసుకోకుండా ఇతర మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి ఎక్కువ ధర కలిగిన బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. బార్‌ లైన్స్‌ ఓనర్‌ ఉద్యాకుమార్‌ రెడ్డి, మేనేజర్‌ సత్యనారాయణరెడ్డి, బార్‌లో పనిచేసే ఉద్యోగి పునిత్‌ పట్నాయక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 10:39 AM