భార్య మందలించిందని.. భర్త చేసిన పనేంటో తెలిస్తే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:22 PM
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఇది. తమ కుటుంబ పరిస్థితి బాగోలేరున్నా భర్త కొద్ది రోజులుగా మద్యాన్ని సేవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- భర్త ఆత్మహత్య
చెన్నై: భార్య మందలించడంతో ఉరేసుకుని భర్త మృతిచెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తిరువళ్లూరు జిల్లా ఆర్‌కేపేటలోని పైవలస గ్రామంలో ముత్తు (36) తన భార్య సుధ (32)తో కలిసి ఇటుకల బట్టీలో కూలి పనిచేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసైన ముత్తు పనికి సరిగ్గా వెళ్ళకపోవడంతో తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: పాక్ జలసంధి వద్ద తీరానికి కొట్టుకొస్తున్న జెల్లీ చేపలు.. వాటిని తాకితే..
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముత్తు మద్యం సేవించి ఇంటికి రాగా, దీంతో అతడి భార్య మద్యం తాగొద్దని గట్టిగా మందలించింది. దీంతో రాత్రంతా వారిద్దరికి వాగ్వాదం జరిగింది. మరుసటిరోజు తెల్లవారుజామున ముత్తుని నిద్రలేపుదామని గది తలుపులు తట్టగా, ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు బద్దలుకొట్టి వెళ్ళి చూడగా, ముత్తు ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేల్లాడుతూ కనిపించాడు.
దీంతో హుటాహుటిన షోలింగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చర్యలు చేపట్టారు.
వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News