Share News

BJP: ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసి.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:49 PM

ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసి.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ ఘటనపై బీజేపీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

BJP: ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసి.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

బెంగళూరు: బెంగళూరు శివారు ప్రాంతం ఆనేకల్‌ పట్టణంలో బీజేపీ(BJP) కార్యకర్త ప్రవీణ్‌గౌడ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు నాగవార బీజేపీ కార్యాలయంలో కార్యకర్త వినయ్‌ సోమయ్య(Vinay Somanna) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. ఆనేకల్‌ ఎస్‌విఎం స్కూల్‌ వద్ద ప్రవీణ్‌గౌడ బేలూరు (35) ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: తమిళ మాధ్యమంలోనే వైద్య విద్య


ఫేస్‌బుక్‌లో పలువురి పేర్లను ప్రస్తావించారు. బీజేపీ హోబళి అధ్యక్షుడు మునిరాజ్‌గౌడ, కౌన్సిలర్‌ భాగ్యమ్మ, శ్రీనివాస్‌లపై ఆరోపణలు చేశారు. కిరణ్‌ అనే వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీడియోలో సమందూరు కిరణ్‌, గోకుల్‌ ఫ్యాషన్‌ హరీశ్‌, భాస్కర్‌, నారాయణప్ప, దొడ్డహాగడె మధుగౌడ, శరవణలు ఆత్మహత్యకు కారణ మని పేర్కొన్నారు. కిరణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, అతను అమ్మాయిలకు ఫోన్‌ చేసి వేధిస్తున్నాడని, అతడి చర్యలన్నీ నాపై వచ్చాయన్నారు.


pandu1.2.jpg

డబ్బుల విషయమై చర్చిద్దామని పిలిపించి దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ హోబళి అధ్యక్షుడు మునిరాజ్‌గౌడ ఇంటికి పిలిస్తే వెళ్లానని, అక్కడ కౌన్సిలర్‌ భాగ్యమ్మ, భర్త శ్రీనివాసులతోపాటు మరో పదిమంది రెండు గంటలపాటు దాడి చేశారని ఆరోపించారు. గురువారం రాత్రి ప్రవీణ్‌ ఆత్మహత్య చేసుకోగా ఆనేకల్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం

ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి

మాటల్లో కాదు చేతల్లో చూపండి

కీర్తి సురేష్ క్యూట్‏గా...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2025 | 09:22 PM