Share News

US China Trade War: అమెరికా, చైనా ట్రేడ్ వార్..భారత్‌కు మొదటి ప్రయోజనం

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:58 PM

అమెరికా-చైనా మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న సమయంలో, భారత్‌కు ఇది ఒక అపూర్వ అవకాశంగా మారింది. ఈ క్రమంలో చైనా తిరస్కరించిన బోయింగ్ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయబోతోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

US China Trade War: అమెరికా, చైనా ట్రేడ్ వార్..భారత్‌కు మొదటి ప్రయోజనం
AirIndiaBoeingDeal

అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం ఇంకా అలాగే కొనసాగుతోంది. ఇదే సమయం భారతదేశానికి ఒక మంచి అవకాశాన్ని అందించినట్లు తెలుస్తోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా చైనా విమానయాన సంస్థలు కొనుగోలు చేయకుండా ఉన్న బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశ ఎయిర్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జూన్ నెల నాటికి ఎయిర్ ఇండియాకు మరో 9 బోయింగ్ 737 సిరీస్ విమానాలు అందనున్నాయి. ఇది చైనా, అమెరికా ట్రేడ్ వార్ కారణంగా ఇండియాకు దక్కిన మొదటి ప్రయోజనమని నిపుణులు చెబుతున్నారు.


వాణిజ్యపరంగా లాభం..

సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా ఇప్పుడు చైనా కోసం తయారు చేసిన బోయింగ్ విమానాలను కొనుగోలు చేయబోతోంది. ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిసింది. రాబోయే నెలల్లో డెలివరీ చేయాల్సిన ఇలాంటి మరిన్ని విమానాలను ఎయిర్ ఇండియా కోరుకుంటోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా వ్యవస్థను దెబ్బతీసినప్పటికీ, భారతదేశం మాత్రం దీనిని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటోంది. ఎయిర్ ఇండియా ఈ వ్యూహం కంపెనీ బలాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రపంచ విమానయాన పరిశ్రమలో భారతదేశం ప్రాధాన్యతను పెంచనుంది.


ఈ ఒప్పందం ఎందుకు ప్రత్యేకం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఒప్పందం సాధ్యమైతే ఎయిర్ ఇండియా ఒకటి కాదు, అనేక ప్రయోజనాలను పొందగలదు. ఎయిర్ ఇండియా తక్కువ సమయంలో ఎక్కువ విమానాలను పొందగలదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు చైనా కంటే ప్రాధాన్యత లభిస్తోంది. ఇది ప్రపంచ విమానయానంలో భారతదేశం ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. జూన్ నెల నాటికి ఎయిర్ ఇండియాకు మరో తొమ్మిది 737 బోయింగ్ విమానాలు వస్తాయని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. దీంతో మొత్తం విమానాల సంఖ్య 50కి చేరుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

Jagdeep Dhankhar: దేశానికి పార్లమెంటే అత్యున్నతం..దీనికి అతీతంగా ఏదీ లేదు


TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్‌ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు

Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు


Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 22 , 2025 | 02:00 PM