Credit cards: అన్ బిల్డ్‌కి, అవుట్ స్టాండింగ్‌కి తేడా తెలుసా?
ABN , Publish Date - Feb 13 , 2025 | 06:53 PM
Credit cards: ప్రపంచంలో అత్యధిక శాతం మంది క్రెడిట్ కార్డు వినియోగిస్తారు. అయితే అందులో అన్ బిల్డ్‌కి, అవుట్ స్టాండింగ్‌కి తేడా తెలుసా? ఇది తెలియక చాలా మంది గందరగోళం చెందుతారు.

ప్రస్తుతం లావాదేవీలన్ని ఆన్‌లైన్‌లోనే జరుగుతోన్నాయి. అందుకు క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో కోట్ల రూపాయిల లావాదేవీలన్నీ క్షణాల్లోనే జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ఖరీదైన వస్తువులను సైతం క్రెడిట్ కార్డులు వినియోగించి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డుల వినియోగించే వారికి బ్యాంకులు.. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, లాంజ్ యాక్సెస్‌తోపాటు ఇతర ప్రయోజనాలను సైతం అందిస్తుంది.
ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే, వినియోగదారులు క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించిన అన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులోని ముఖ్యమైన రెండు అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. అన్ బిల్డ్ అమౌంట్ (Unbilled amount), మరొకటి.. అవుట్ స్టాడింగ్ అమౌంట్ (Outstanding amount). వీటి గురించి కొంత మందికి తెలియదు. అందువల్ల వారు గందరగోళంలో పడిపోతారు. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఉంది. అదేమింటంటే..?
Also Read: లోపాయికారీ ఒప్పందం లేదు.. దాపరికం లేదు..
క్రెడిట్ కార్డ్‌లో అన్ బిల్డ్ అమౌంట్
క్రెడిట్ కార్డులో అన్‌బిల్డ్ అమౌంట్ అంటే.. కార్డు ద్వారా మొత్తం లావాదేవీల్లో జరుగుతాయి. కానీ నెక్ట్స్ మంత్ క్రెడిట్ కార్డులో బిల్లు వస్తుంది.
Also Read: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..
అన్ బిల్డ్ అమౌంట్‌ను ఎలా తనిఖీ చేయాలి ?
క్రెడిట్ కార్డ్ జారీ చేసే వారు వివిధ మార్గాల్లో బిల్ చేయని లావాదేవీలను తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తారు. మీ అన్‌బిల్ మొత్తాన్ని తనిఖీ చేయడానికి మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగించవచ్చు.
Also Read: కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
అన్ బిల్డ్ అమౌంట్‌ను తనిఖీ చేయడం ఎందుకు ముఖ్యమంటే?
మీ క్రెడిట్ కార్డ్ అన్ బిల్డ్ అమౌంట్ మొత్తాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వినియోగదారులకు కార్డ్.. మిగిలిన క్రెడిట్ పరిమితి గురించి మంచి అవగాహనను ఇస్తుంది.
Also Read: చవితి వేడుకలకు ప్రధాని హాజరు స్పందించిన రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
క్రెడిట్ కార్డ్‌లో అవుట్ స్టాండింగ్ అమౌంట్
బాకీ ఉన్న బ్యాలెన్స్ అంటే మీ క్రెడిట్ కార్డ్‌పై మీరు చెల్లించాల్సిన మొత్తం. ఇందులో మునుపటి బకాయి మొత్తం, బిల్ చేయని మొత్తంతోపాటు ఏవైనా ఇతరత్ర వర్తించే ఛార్జీలు ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. బకాయి మొత్తంలో మునుపటి నెలలతోపాటు స్టేట్‌మెంట్ ముగింపు తేదీ తర్వాత ఖర్చు చేసిన మొత్తం ఉంటుంది.
అధిక బకాయి మొత్తం కలిగి ఉండటం మీ క్రెడిట్ కార్డ్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో మరింత క్రెడిట్‌ని పొందడానికి వినియోగదారులకు కష్టతరం చేస్తుంది. అందువల్ల క్రెడిట్ కార్డ్‌లో బకాయి ఉన్న మొత్తాన్ని సకాలంలో చెల్లించడమన్నది చాలా ముఖ్యం.
For Business News And Telugu News