Share News

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

ABN , Publish Date - May 19 , 2025 | 02:02 PM

ప్రస్తుత కాలంలో లోన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ యాప్‌ ద్వారా నిమిషాల్లోనే తీసుకోవచ్చు. కానీ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
loan apps

ప్రస్తుత రోజుల్లో డబ్బు అవసరం ఎప్పుడు, ఏ సమయంలో ఎందుకైనా రావచ్చు. ఉదాహరణకు వైద్యం, విద్య, పెళ్లి సహా ఇంకా అనేక ఆకస్మాత్తు ఖర్చులు కూడా రావచ్చు. ఇలాంటి సమయంలో తెలిసిన వారి దగ్గర సమయానికి డబ్బు సాయం దొరకకపోతే అనేక మంది కూడా యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి బ్యాంక్ కూడా మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. అయితే కొన్ని యాప్స్ మాత్రం ప్రత్యేకంగా లోన్స్ కోసం (Loan Apps) వెలుగులోకి వచ్చాయి. ఇదే అదునుగా భావించిన పలు రకాల ఫేక్ యాప్స్ కూడా ఇదే దందా కొనసాగిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో యాప్స్ ద్వారా రుణాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


మొదటి తప్పు

లోన్ తీసుకునే ముందు మీరు డైరెక్ట్‌గా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి లోన్ కోసం అప్లై చేయోద్దు. ముందుగా ఆ యాప్ నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ యాప్ రివ్యూలు చదవాలి. ఇతర వినియోగదారులు ఏమంటున్నారనే విషయాలు చూడాలి. వారు ఎలాంటి అనుభవాలు పొందారు. అది ఫేక్ యాప్ సర్వీస్ ఇస్తుందా లేదంటే వేధింపులు చేస్తున్నారా అనే విషయాలను రివ్యూలను చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో లేదా ఆప్‌ల్ స్టోర్‌లో రేటింగ్ ఎంత ఉందనే చూసి నిర్ణయం తీసుకోవాలి.


రెండో తప్పు

మీకు లోన్ ఇవ్వడానికి ముందు యాప్ ఒక "ప్రాసెసింగ్ ఫీజు" లేదా "రిజిస్ట్రేషన్ ఫీజు" అడిగితే, అది చాలా తప్పుడు యాప్ అని నిర్ధారించుకోండి. నిజమైన రుణ సంస్థలు లేదా యాప్స్ మీ నుంచి ఎలాంటి ఫీజులను వసూలు చేయవు. ఒక వేళ మీరు వాటిని నమ్మి డబ్బు చెల్లిస్తే ఆ తర్వాత కూడా మీకు లోన్ లభించదు.

మూడో తప్పు

యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అది అడిగే అనుమతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాప్‌లు మీ ఫోన్ గ్యాలరీ, కాంటాక్ట్స్, లోకేషన్, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు యాక్సెస్ అడుగుతాయి. ఈ క్రమంలో అన్నింటికి యాక్సెస్ ఇవ్వొద్దు. వీటికి అనుమతి ఇవ్వడం వలన మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుంది. కొన్ని యాప్‌లు ఈ సమాచారాన్ని ఉపయోగించి మిమ్మల్ని బెదిరించే ఛాన్సుంది. అందుకే అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వాలి.


నాల్గో తప్పు

కొందరు యాప్‌ల నుంచి లోన్ తీసుకున్న తరువాత సమయానికి చెల్లింకపోతే ఆయా యాప్‌లు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి. రోజుకు పదేపదే కాల్స్ చేయడం, బెదిరింపు మెసేజ్‌లు పెట్టడం, లేదంటే మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడటం చేస్తుంటారు. అంతేకాదు ఒక్క నెల చెల్లించకపోయినా మీ లోన్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. కాబట్టి మీరు లోన్ తీసుకునే ముందు ఆయా యాప్ కస్టమర్ సర్వీస్ కేంద్రం మీ ప్రాంతంలో ఉందో లేదో తెలుసుకోవాలి.

దీంతోపాటు హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది. ఎల్లప్పుడు కస్టమర్ సపోర్ట్ ఉందా లేదా అనే విషయాలను తప్పకుండా పరిశీలించాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా ఫేక్ యాప్ ద్వారా మీరు తక్కువ మొత్తం డబ్బు తీసుకున్నా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పలు యాప్స్ అయితే మీరు చెల్లించిన తర్వాత కూడా చెల్లించలేదని మోసం చేస్తుంటారు. అలాంటి వాటి గురించి ఆర్బీఐ లేదా సైబర్ కేంద్రానికి ఫిర్యాదు చేయాలి.


ఇవీ చదవండి:

SBI: ఎఫ్‌డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్‌బీఐ


Heavy Rain: భారీ వర్షం, ఆఫీసులు బంద్.. జేసీబీలో ఎమ్మెల్యే పర్యటన..


భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 02:02 PM