5 Smart Ways to Repayment: మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 06:58 PM
మీకు ఆర్థిక రుణ భారం చాలా ఎక్కువగా ఉందా. అది ఎలా తీర్చాలని బాధపడుతున్నారా. అయితే మీ జీవనశైలిలో చిన్న మార్పులు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటే మీ అప్పు నుంచి బయటపడటం సులభమని నిపుణులు (5 Smart Ways to Repayment) చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

మీకు ఆర్థిక రుణ భారం ఉంటే, ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో సరైన ప్రణాళిక, ఖర్చులపై నియంత్రణ, ఆదాయ మార్గాలపై దృష్టి పెడితే, మీ అప్పును ఈజీగా తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ చిట్కాలు మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరచడమే కాకుండా, మనశ్శాంతిని కూడా ఇస్తాయని అంటున్నారు. అయితే అందుకోసం ఏం చేయాలనే విషయాలను (5 Smart Ways to Repayment) ఇప్పుడు తెలుసుకుందాం.
1. అదనపు చెల్లింపులు
మీ EMIలను నెలవారీ బదులు రెండు వారాలకోసారి చెల్లించే విధానానికి మారడం వల్ల సంవత్సరానికి ఒక అదనపు చెల్లింపు వస్తుంది. ఇది క్రమంగా మీ రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే, నెలకు రూ. 2,000 వంటి చిన్న అదనపు చెల్లింపులు కూడా మొత్తం వడ్డీని తగ్గించి, మీ రుణాన్ని త్వరగా తీర్చేందుకు సహాయపడతాయి.
2. బోనస్‌ల ఉపయోగం
ఉద్యోగ బోనస్, ట్యాక్స్ రిఫండ్ లేదా మీకు లభించిన ఊహించని ఆదాయాలను మీ రుణం మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీ వడ్డీ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. అయితే దీనికి ముందస్తు చెల్లింపు షరతులను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని బ్యాంకులు వీటిపై కూడా జరిమానాలు విధిస్తాయి.
3. రీఫైనాన్స్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్
తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణంతో రీఫైనాన్స్ చేయడం లేదా మీ రుణ బ్యాలెన్స్‌ను మరో బ్యాంకుకు బదిలీ చేయడం వల్ల కూడా మీ వడ్డీ ఖర్చు తగ్గుతుంది. ఇది తిరిగి రుణం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే, రీఫైనాన్స్ ఫీజు లేదా ఇతర ఖర్చుల ప్రయోజనాన్ని తగ్గించకుండా చూసుకోండి.
4. బడ్జెట్‌ను నిర్వహించడం
అనేక రుణాలు ఉంటే, వాటిని ఒకే తక్కువ వడ్డీ రేటు రుణంగా మార్చుకోండి. ఇది మీ EMI భారాన్ని తగ్గిస్తుంది. మీ చెల్లింపులను సులభతరం చేస్తుంది. అలాగే, అనవసర ఖర్చులను (OTT సబ్‌స్క్రిప్షన్‌లు, డైనింగ్, పుట్టినరోజు వేడుకలు వంటివి) తగ్గించి, ఆ డబ్బును రుణ చెల్లింపునకు కేటాయించుకోండి. నెలవారీ ఖర్చులను సమీక్షించి, అనవసర ఖర్చులను గుర్తించండి.
5. ఆదాయాన్ని పెంచుకోవడం
సైడ్ గిగ్‌లు, ఫ్రీలాన్స్ పనులు లేదా ఇతర ఆదాయ వనరుల ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించండి. దానిని రుణ చెల్లింపునకు ఉపయోగించండి. అలాగే, EMIలను ఆటోమేట్ చేయడం వల్ల ఆలస్య చెల్లింపులను నివారించుకోవచ్చు. కొన్ని బ్యాంకులు రేటు డిస్కౌంట్‌లను కూడా అందిస్తాయి. అలాంటి వాటిని వినియోగించుకోండి. ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీరు మీ వ్యక్తిగత రుణాన్ని త్వరగా తీర్చడమే కాక, ఆర్థిక ఒత్తిడి నుంచి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు.
ఇవీ చదవండి:
వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి