Share News

Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:25 PM

ఫుడ్ ప్రియులు ఎక్కడ ఉన్నా కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని మరి లాగించేస్తారు. ఈ క్రమంలోనే రైళ్లలో ప్రయాణించే సమయంలో కూడా అనేక మంది స్విగ్గీ ఆర్డర్లు చేశారని సంస్థ తెలిపింది. ఈ క్రమంలో స్విగ్గీ IRCTCతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..
Swiggy Food Delivery Services

దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) IRCTCతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో దేశంలోని 20 రాష్ట్రాల్లోని 100 రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త సేవల ద్వారా ప్రయాణీకులు వారి రైలు సీట్లలోనే కూర్చుని ఫుడ్ ఎంపికలను పొందవచ్చని తెలిపింది. రైలు ప్రయాణికులు దేశవ్యాప్తంగా 60,000 బ్రాండ్‌ల నుంచి 35+ వంటకాలతోపాటు 7 మిలియన్లకు పైగా మెనూ ఐటెమ్‌లను ఎంచుకోవచ్చని స్విగ్గీ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రయాణికులకు భోజనాలను అందించడం ద్వారా తన సేవల సౌలభ్యాన్ని మరింత పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది.


స్విగ్గీ సీటుకు హామీ డెలివరీ లేదా పూర్తి వాపసు సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఇందులో వినియోగదారులు తమకు నచ్చిన స్టేషన్‌లో ముందుగా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో వినియోగదారులు స్విగ్గీ యాప్‌లో “రైలు” అని శోధించి, తమ రైలు PNRను నమోదు చేయాలి. తద్వారా ఆహారం డెలివరీ చేయగల వారి ప్రయాణ ప్రణాళికలోని అన్ని స్టేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సేవతో రైలు ప్రయాణీకులకు ఇబ్బంది లేని భోజన సదుపాయం అందించనున్నట్లు చెప్పారు.


రైలులో ఆహారం ఆర్డర్‌ల కోసం అందుకు సంబంధించిన వివరాలను కూడా స్విగ్గీ విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతి భోజనంతో పాటు ఒక చెంచా, ఫోర్క్, టిష్యూ పేపర్‌ను పర్యావరణమైన అనుకూలమైన పద్దతిలో చక్కగా ప్యాక్ చేసి ఇవ్వబడుతుందని చెప్పారు. మార్చి 2024 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి రైలులో ఆహారాన్ని డెలివరీ చేయడానికి స్విగ్గీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.


ప్రస్తుతం రైలు ప్రయాణాలు భారతదేశ సంస్కృతిలో అంతర్భాగంగా మారాయని స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మాలూ అన్నారు. ఈ అనుభవంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైళ్లలో స్విగ్గీ ఫుడ్‌ను 100 స్టేషన్లకు విస్తరించడం వల్ల ప్రయాణీకులకు ఫుడ్ విషయంలో మరింత సౌలభ్యం లభిస్తుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా విభిన్న రకాల భోజనాలను పొందే అవకాశం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.


ఈ క్రమంలో స్విగ్గీ ఇప్పటికే కేవలం 60 సెకన్ల హాల్ట్‌తోనే రైళ్లలో 35,000 ఆర్డర్‌లను డెలివరీ చేసినట్లు చెప్పారు. ఒకే ట్రిప్‌లో దాదాపు 54,000 మంది ప్రయాణికులు అనేక రకాల భోజనాలను ఆర్డర్ చేశారని వెల్లడించింది. విజయవాడ జంక్షన్ నుంచి గత ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ఆర్డర్‌లు నమోదు కాగా, ఆ తర్వాత నెల్లూరు, సికింద్రాబాద్ జంక్షన్, కాట్పాడి జంక్షన్ నుంచి వచ్చాయన్నారు. ముఖ్యంగా కళ్యాణ్ జంక్షన్‌లో అతిపెద్ద ఆర్డర్ వెలుగులోకి వచ్చింది. 41 బర్గర్‌లతో పాటు 40 ఫ్రైస్‌తో కూడిన భోజనం ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. క్రమంగా ప్రయాణికుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో డెలివరీల సంఖ్య కూడా పెరుగుతుందని స్విగ్గీ చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

Toyota: టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..


H 1B Visa: హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఫీజు, గడువు వివరాలివే..


Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 07 , 2025 | 05:26 PM