JioPC: ఇక మీ టీవీనే.. మీ కంప్యూటర్. ఎలా సెట్ చేసుకోవాలంటే..
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:28 PM
రిలయన్స్ జియో సంస్థ జియో పీసీ సేవలు ప్రారంభించింది. తద్వారా సెట్-టాప్ బాక్స్ ద్వారా టీవీలను పర్సనల్ కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. ఇది సాధారణ టీవీని కంప్యూటర్‌గా మార్చగల క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీస్.

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ జియో సంస్థ జియో పీసీ సేవలు ప్రారంభించింది. తద్వారా సెట్-టాప్ బాక్స్ ద్వారా టీవీలను పర్సనల్ కంప్యూటర్లుగా వాడుకోవచ్చు. ఇది సాధారణ టీవీని కంప్యూటర్‌గా మార్చగల క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీస్. పీసీ సేవలను పొందాలంటే జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదార్లు యాప్ విభాగంలో జియో పీసీ యాప్‌పై క్లిక్ చేయాలి. టీవీని మీ కంప్యూటరుగా వాడాలంటే వినియోగదార్లకు ఒక కీబోర్డు, మౌస్ అమర్చుకోవాలి. వీడియో కాలింగ్ కోసం, వినియోగదారు వెబ్‌క్యామ్ యాక్సెసరీని కొనుగోలు చేయాలి. ఇలా వాడే కంప్యూటరులో 8 జీబీ ర్యామ్, జియో వర్క్‌స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (బ్రౌజర్) ఇంకా 100 GB క్లౌడ్ స్టోరేజ్‌కి యాక్సెస్ పొందుతారు.
ఇక, జియోపీసీ సెట్-టాప్ బాక్స్ (క్వాడ్-కోర్ ప్రాసెసర్, ఉబుంటు లైనక్స్ OS తో వస్తుంది. టెలివిజన్ లేదా ఏదైనా సాధారణ డిస్ప్లే మానిటర్‌కు కనెక్ట్ చేసుకోవాలి. జియోపీసీ నెలకు రూ. 400 నుండి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో వస్తుంది (పరిమిత సమయం వరకు మాత్రమే). దీనితో, వినియోగదారులు 1-నెల ఉచిత ట్రయల్ పొందుతారు. ఇప్పటికే ఉన్న జియో ఎయిర్‌ఫైబర్, జియో ఫైబర్ సర్వీస్ వినియోగదారులు ఎటువంటి అదనపు చెల్లింపు లేకుండా యాక్టివేట్ చేసుకోవచ్చు. వినియోగదారు గోప్యత, భద్రత విషయానికొస్తే, వైరస్, మాల్వేర్ వంటి సైబర్ బెదిరింపుల నుండి నెట్‌వర్క్-స్థాయి భద్రతను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. అంతేకాదు ఇది.. JioPC హ్యాక్-ప్రూఫ్ కూడా.
JioPC సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు :
నెల వారీ ప్లాన్: నెలకు రూ. 599 + (అపరిమిత వినియోగం) ప్లస్ GST
రెండు నెలల ప్లాన్: రూ. 999 + (అపరిమిత వినియోగం) ప్లస్ GST
మూడు నెలల ప్లాన్: రూ. 1,499 + GST (అదనపు ఒక నెల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో. మొత్తం, నాలుగు నెలలు)
ఆరు నెలల ప్లాన్: రూ. 2,499 + GST (అదనపు రెండు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో. మొత్తం, ఎనిమిది నెలలు)
వార్షిక ప్లాన్: రూ. 4,599 + GST (అదనపు మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో, మొత్తం, 15 నెలలు)
అన్ని JioPC ప్లాన్‌లలో 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు Adobe Express ప్రీమియం ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది.
JioPC సెటప్ ఇలా చేసుకోవాలి :
మీ ఇంట్లో JioPC ని ఎలా సెటప్ చేయాలో ఇక్కడ చూద్దాం:
1వ దశ : మీరు ఇంట్లో JioPC సిస్టమ్‌ను పొందిన తర్వాత, మీ Jio సెట్-టాప్ బాక్స్‌ను ఆన్ చేసి యాప్‌ల విభాగానికి వెళ్లండి.
2వ దశ : JioPC యాప్‌ను ఒపెన్ చేసి, ‘స్టార్ట్ బటన్’ క్లిక్ చేయండి
3వ దశ : మీ కీబోర్డ్, మౌస్‌ను ప్లగ్ చేయండి
4వ దశ : మీ లింక్ చేయబడిన కాంటాక్ట్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి
5వ దశ : లాగిన్ అయిన తర్వాత మీ క్లౌడ్ కంప్యూటర్‌ను తక్షణమే ఉపయోగించడం ప్రారంభించండి
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..