Share News

Sravanthi Theatre: కింగ్‌డమ్ సినిమా కోసం మరమ్మతులు.. భారీ అగ్ని ప్రమాదం..

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:26 PM

కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు..

Sravanthi Theatre: కింగ్‌డమ్ సినిమా కోసం మరమ్మతులు.. భారీ అగ్ని ప్రమాదం..
Sravanthi Theatre

నెల్లూరు, జులై 30: కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్‌ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.


అగ్ని ప్రమాదం కారణంగా ప్రొజెక్టర్ రూమ్, ఫర్నిచర్, స్క్రీన్ దగ్ధం అయినట్లు థియేటర్‌ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి(Kavya Krishnareddy) థియేటర్ యజమానులను పరామర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కొత్త సినిమా రిలీజ్‌ల సందర్భంగా థియేటర్ వద్ద చేస్తున్న కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు జాగ్రతగా ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు.


Also Read:

గిఫ్ట్ ఇచ్చిన వరుడు.. కుప్పకూలిన వధువు సోదరి..

మద్యం ముట్టకున్నా ఫ్యాటీ లివర్..!

For More Telugu News and Telugu News..

Updated Date - Jul 30 , 2025 | 03:26 PM