Stock News: రూ.8,300 షేర్ ధర ఒక్కరోజే 33 శాతం తగ్గుదల.. ఇన్వెస్టర్లకు షాకింగ్..
ABN , Publish Date - Jun 06 , 2025 | 07:07 PM
ఓ కంపెనీ షేర్లు రూ.8,300 నుంచి ఈరోజు ఒక్కరోజే ఏకంగా 33 శాతం పడిపోయి రూ. 6,007.75కి చేరుకున్నాయి. ఇలాంటి భారీ తగ్గుదల ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే అసలు ఎందుకు ఈ షేర్ ఒక్కసారిగా పడిపోయింది, ఏంటనే విషయాలను తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్లో శిల్చర్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు (Silchar Technologies stocks) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ సంస్థ షేర్లు ఒక్కరోజులోనే 33 శాతం పడిపోయాయి. ఈ క్రమంలో రూ.8,300 నుంచి రూ.6007.75కు చేరాయి. అయితే తాజాగా ఈ కంపెనీ 27,46,52,718 బోనస్ షేర్లను జారీ చేయాలని ప్రకటించింది. ఈ బోనస్ షేర్ల ఫేస్ విలువ రూ.2గా ప్రకటించింది. జూన్ 9, 2025ను ఈ బోనస్ షేర్ల చెల్లింపు తేదీగా నిర్దేశించారు. జూన్ 10, 2025న ఈ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది.
ప్రధాన కారణం ఇదేనా..
ఈ బోనస్ షేర్ల జారీకి అర్హత పొందడానికి రికార్డ్ తేదీ (May 23, 2025) నాటికి షేర్లను కలిగి ఉండాలి. రికార్డ్ తేదీ తరువాత షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ బోనస్ షేర్లను పొందలేరు. బోనస్ షేర్ల 1:2 రేషియో పంపిణీ అనంతరం శిల్చర్ టెక్నాలజీస్ షేర్లు ధర రూ.5,870 వద్ద ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసిన అనేకమంది ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాల వైపు మొగ్గుచూపిన కారణంగా షేర్ ధర పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐదేళ్లలో పెరుగుదల
గత ఐదు సంవత్సరాలలో, శిల్చర్ టెక్నాలజీస్ షేర్లు రూ.25 నుంచి రూ.8,300 వరకు పెరగడం విశేషం. ఇది దాదాపు 33,000% పెరుగుదల. ఈ క్రమంలో షేరు ధర భారీ స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ, తాజాగా తగ్గుదలకు వచ్చింది. ఈ షేర్లలో మళ్లీ గెయిన్ జరగవచ్చని పలువురు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. శిల్చర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రస్తుతం రూ.6,700 కోట్లను దాటింది. ఈ భారీ వ్యాపార ప్రగతి కంపెనీని మార్కెట్లో ఒక శక్తివంతమైన ప్లేయర్‌గా నిలిపింది. గరిష్ట పెరుగుదల చూస్తున్నప్పటికీ, తాజాగా 33% తగ్గుదలను సూచిస్తుంది.
ఫైనాన్షియల్ ఫలితాలు
ఈ ఏడాదిలో శిల్చర్ టెక్నాలజీస్ తన నికర లాభాన్ని 121.35% పెంచుకుని రూ.55.36 కోట్ల లాభం సాధించింది. కంపెనీ ఆపరేషన్ లాభం రూ.71 కోట్లుగా నమోదు చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 31%గా ఉంది. ఇది కంపెనీ రాబడి, సామర్థ్యాల పట్ల కీలక సంకేతాలను ఇస్తుంది. ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 64.01% ఉండగా, పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటా 35.99%గా కలదు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) వాటా కేవలం 2.06% మాత్రమే. అలాగే, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీల వాటా 0.03%, 0.08%గా ఉంది.
ఇవీ చదవండి:
భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..