Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
ABN , Publish Date - Apr 27 , 2025 | 06:54 PM
భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన అక్షయ తృతీయను ఈ ఏడాది ఏప్రిల్ 30న జరుపుకుంటారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే శ్రేయస్సు, అదృష్టం వస్తుందని అనేక మంది భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం భారీగా పెరిగిన పసిడి రేట్ల నేపథ్యంలో గోల్డ్ కొనుగోలు చేయాలా వద్దా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ తృతీయ (Akshay Tritiya 2025) రోజు వస్తే చాలు, అనేక మంది కూడా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. వేదాలు, పురాణాల ప్రకారం, సంపద, ఐశ్వర్యం పొందడానికి ఈరోజు మంచిదని చెబుతుంటారు. కానీ సంపదను ఆకర్షించే ఈ రోజున గోల్డ్ కొనడం ప్రస్తుతం ఎక్కువగా చర్చించబడే విషయంగా మారిపోయింది. ఎందుకంటే పసిడి ధరలు ఇప్పుడు దాదాపు లక్షకు చేరి మళ్లీ కొంత తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో గోల్డ్ కొనుగోలు చేయాలా వద్దా, కొంటే ఎలాంటి పసిడి తీసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత ధరలు..
ప్రస్తుతం ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,240 (10 గ్రాములకు) గా ఉంది. అయితే, ఈ ధర అక్షయ తృతీయ (ఏప్రిల్ 30న) సందర్భంగా తగ్గుతుందా, లేదంటే పెరుగుతుందా అని అనేక మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ధరలు తగ్గింతే కొనుగోలు చేయాలని పలువురు చూస్తుండగా, మరికొంత మంది మాత్రం పెరిగినా కూడా మంచి రోజు కాబట్టి కొంత వరకు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రతి ఏటా కూడా అక్షయ తృతీయ రోజు అలవాటుగా గోల్డ్ కొనుగోలు చేసేవారు సైతం ఈసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ధరల మార్పు..
గత వారం (ఏప్రిల్ 18, 2025) 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,580 (10 గ్రాములకు)గా ఉంది. అంటే పది రోజుల్లో ధరలో రూ.660 పెరుగుదల వచ్చింది. మరోవైపు గత నెల (మార్చి 20, 2025)న 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,320 (10 గ్రాములకు) గా ఉంది . ఈ ధర నెల రోజుల్లో రూ.8,920 పెరుగుదలతో ప్రస్తుతం రూ.98,240కి చేరుకుంది. రానున్న రోజుల్లో మాత్రం ఈ ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలు చేయాలా, వేచి ఉండాలా
అక్షయ తృతీయ పండుగ సందర్భంగా గోల్డ్ ధరలు సాధారణంగా పెరుగుతాయి. అయినప్పటికీ ఈ సీజన్‌లో కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. కానీ ప్రస్తుత ధరలు, భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశాలను పరిగణలోకి తీసుకుని కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గత వారం, గత నెలలో ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నందున ఆఫర్లను తెలుసుకుని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అంతేకాదు కొనుగోలు చేసే విషయంలో మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో ధరల పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. భారీగా ధరలు పెరిగితే కొంత రోజులు వేచి చూడడం మంచిదంటున్నారు. దీంతోపాటు గోల్డ్ కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్ ఉన్న వాటిని చూసి తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఆంధ్రజ్యోతి పసిడి కొనుగోలు, పెట్టుబడులు చేయాలని సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News