Global Finance Awards: ఎస్‌బీఐకి వరల్డ్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ అవార్డు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:59 AM
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ).. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్.

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ).. 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంక్ అవార్డును గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్, బ్యాంకర్స్, విశ్లేషకుల నుంచి సేకరించిన వివరాలను మదింపు చేయటంతో పాటు సమగ్ర పరిశోధన, విశ్లేషణ ఆధారంగా ఎస్‌బీఐని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు గ్లోబల్ ఫైనాన్స్ వెల్లడించింది. కాగా బ్యాంక్ అభివృద్ధి వ్యూహానికి ఖాతాదారుల అనుభూతి మూలస్తంభమని ఎస్‌బీఐ చైర్మన్ సీ. శ్రీనివాసులు శెట్టి ఈ సందర్భంగా అన్నారు. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ అవార్డు ఖాతాదారుల సేవలకు తమను మరింత కట్టుబడి ఉండేలా చేస్తుందన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా ఈ ఏడాది అక్టోబరు 18న అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగే కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి ఈ అవార్డును అందుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి