Share News

SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. జూలై 15 నుంచి అమల్లోకి కొత్త మార్పులు

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:56 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ (Credit Card) యూజర్లకు కీలక అప్‎డేట్ వచ్చేసింది. జూలై 15 నుంచి మీరు కొత్త రూల్స్ ఎదుర్కొనున్నారు. అయితే మారనున్న రూల్స్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. జూలై 15 నుంచి అమల్లోకి కొత్త మార్పులు
SBI Credit Card

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే జూలై 15 నుంచి SBI క్రెడిట్ కార్డ్‌లలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు కార్డ్‌ హోల్డర్లు తమ చెల్లింపులను ఎలా నిర్వహిస్తారు. కార్డ్‌లతో లభించే ప్రయోజనాలను ఎలా ఉపయోగించుకుంటారనే విషయాలపై ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 15 నుంచి SBI క్రెడిట్ కార్డ్‌ల కనీస చెల్లింపు మొత్తం (MAD) లెక్కింపు విధానం మారనుంది. మీరు ఏదైనా EMI ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మొత్తం కూడా కనీస చెల్లింపు మొత్తంలో చేరుతుంది.


  • వివిధ ఛార్జీలు: లేట్ ఫీజు, ఓవర్ ‌లిమిట్ ఛార్జీలు, ఇతర ఫీజులు

  • ఫైనాన్స్ ఛార్జీలు: వడ్డీ రూపంలో విధించే ఛార్జీలు

  • 2% మిగిలిన బ్యాలెన్స్: మీ కార్డ్‌లో మిగిలిన బ్యాలెన్స్‌లో 2% MADలో చేరుతుంది

ఈ కొత్త లెక్కింపు విధానం వల్ల కార్డ్‌ హోల్డర్లు ప్రతి నెలా చెల్లించాల్సిన కనీస మొత్తం పెరుగుతుంది. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోతే, మీ బకాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వడ్డీ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ బడ్జెట్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.


సెటిల్‌మెంట్ ప్రక్రియలో మార్పు

  • SBI క్రెడిట్ కార్డ్‌లతో చెల్లింపులు సెటిల్ చేసే విధానం కూడా మారనుంది. ప్రస్తుతం మీరు చేసే చెల్లింపులు క్రమంగా క్రింది విధంగా సెటిల్ అవుతాయి.

  • GST: మీ చెల్లింపు మొత్తం మొదట GST కోసం ఉపయోగించబడుతుంది

  • EMIలు: తర్వాత EMI చెల్లింపులకు వెళ్తుంది

  • ఛార్జీలు: లేట్ ఫీజు, ఫైనాన్స్ ఛార్జీలు, ఇతర ఫీజులు కూడా వర్తిస్తాయి

  • ప్రిన్సిపల్ మొత్తం: చివరగా మీ రిటైల్ కొనుగోళ్లు లేదా క్యాష్ విత్‌ డ్రాయల్స్ వంటివి ప్రిన్సిపల్ మొత్తానికి వర్తిస్తాయి

  • ఈ కొత్త విధానం వల్ల మీరు పాక్షిక చెల్లింపులు చేస్తే, GST, EMIలు, ఛార్జీలు, వడ్డీలు మొదట క్లియర్ అవుతాయి


యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రద్దు

మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఆగస్టు 11, 2025 నుంచి SBI కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం రద్దు కానుంది. ఈ ఇన్సూరెన్స్ ద్వారా గతంలో రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు కవరేజ్ లభించేది. ఈ సౌకర్యం UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులతో కలిసి జారీ చేసిన కార్డ్‌లకు, అలాగే ఇతర ప్రముఖ SBI కార్డ్ వేరియంట్‌లకు వర్తిస్తుంది. కాబట్టి మీ కార్డ్ ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 05:57 PM