No Minimum Balance: కస్టమర్లకు గుడ్ న్యూస్.. SBIతో పాటు 6 బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:55 PM
సాధారణంగా మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోవడం (No Minimum Balance). కానీ కొన్ని బ్యాంకులు మాత్రం ప్రస్తుతం మీ సేవింగ్ అకౌంట్ ఖాళీగా ఉన్నప్పటికీ, ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు. వాటిలో ఏవేవి ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

మధ్య తరగతి ప్రజల జీవితం ఎన్నో సవాళ్లతో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రెంట్, రోజువారీ ఖర్చులు, పిల్లల చదువుతో మొదలుకుని అనేకం ఉంటాయి. దీనికి తోడు బ్యాంకులు విధించే కనీస బ్యాలెన్స్ రూల్ మరో భారంగా మారుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న పలు బ్యాంకులు సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ (No Minimum Balance) నిబంధనను తొలగించాయి. దేశంలోని అగ్రగామి బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో పాటు మరికొన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ విధించే ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి. వాటిలో ఇంకా ఏ బ్యాంకులు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
జూలై 1, 2025 నుంచి కనీస బ్యాలెన్స్ షరతులను అన్ని సేవింగ్ ఖాతాలపై విధించే ఛార్జీని బ్యాంక్ ఆఫ్ బరోడా రద్దు చేసింది. కానీ, ప్రీమియం సేవింగ్ ఖాతా పథకాలపై ఈ ఛార్జీని రద్దు చేయలేదు.
2. ఇండియన్ బ్యాంక్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ కూడా కనీస బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 7, 2025 నుంచి అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
3. కెనరా బ్యాంక్
ఈ సంవత్సరం మే నెలలో సాధారణ సేవింగ్ ఖాతాలతో సహా అన్ని రకాల పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని కెనరా బ్యాంక్ రద్దు చేసింది. వీటిలో శాలరీ, NRI సేవింగ్ ఖాతాలు కూడా ఉన్నాయి.
4. పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2020 నుంచి కనీస బ్యాలెన్స్‌ను వసూలు చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇప్పుడు దానిని కూడా రద్దు చేసింది. అంటే, ఇప్పుడు సేవింగ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ పాటించకపోయినా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
6. బ్యాంక్ ఆఫ్ ఇండియా
మినిమం బ్యాలెన్స్ విషయంలో సేవింగ్ ఖాతాలకు కస్టమర్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించింది. దీని ప్రకారం మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి