Sanjay Malhotra RBI: రెపో కోతకు ప్రస్తుత ధరలే కొలమానం కాదు
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:16 AM
గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లకు..

ద్రవ్యోల్బణం, వృద్ధి ధోరణుల ఆధారంగానే నిర్ణయం
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్రా స్పష్టీకరణ
ముంబై: గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లకు పైగా కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి జారుకున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక రెపోరేట్లను మరింత తగ్గించవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశా రు. ప్రస్తుత గణాంకాలు మాత్రమే రెపోరేటు గమనాన్ని ప్రభావితం చేయలేవని.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై భవిష్యత్ దృక్పథం ఆధారంగా వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 12 నెలల వరకు ద్రవ్యోల్బణ సూచీ గమనం ఎలా ఉండవచ్చన్న అంచనాలను ఇందుకు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. నాలుగో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ మళ్లీ 4.4 శాతానికి పెరగవచ్చన్న అంచనాలున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే, నాలుగో త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాను మరిం త తగ్గించే అవకాశాలున్నాయని అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్‌బీఐ రెపో రేటును 1 శాతం తగ్గించింది. దాంతో రెపో 5.50 శాతానికి దిగివచ్చింది. ముంబై లో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మల్హోత్రా ప్రస్తావించిన మరిన్ని విషయాలు..
ఈ ఏడాదిలో జూన్ వరకు బ్యాంక్‌ల రుణరేట్లు 0.50 శాతం వరకు తగ్గాయి. అప్పటివరకు ఆర్‌బీఐ అర శాతం రెపో తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంక్‌లు కస్టమర్లకు దాదాపుగా బదిలీ చేశాయి. కాగా, ఈ జూన్ 6న ఆర్‌బీఐ రెపోరేటును మరో 0.50 శాతం తగ్గించింది.
ఆర్‌బీఐ రెపో తగ్గింపు వ్యవస్థలో ఆస్తుల బుడగకు (అసెట్ బబుల్) దారితీయదు. ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చేందుకు రెపో తగ్గింపుతోపాటు ఆర్‌బీఐ అమ్ములపొదిలో ఇతర అస్త్రాలూ ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ల రుణ వృద్ధి 12.1 శాతంగా ఉంది. దశాబ్ది సగటు 10 శాతం కంటే మెరుగ్గానే ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) రుణ వృద్ధి 9 శాతానికి పరిమితం కావచ్చు.
యూకేతో ఎఫ్‌టీఏ భారత్‌కు మేలే..
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎ్‌ఫటీఏ) ఆర్‌బీఐ గవర్నర్ స్వాగతించారు. యూకేతో ఎఫ్‌టీఏ దేశంలోని పలు రంగాల వృద్ధికి తోడ్పడనుందన్నారు. భారత్ మరిన్ని దేశాలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పం దం చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News