Reliance Jio New Plan: శుభవార్త చెప్పిన రిలయన్స్ జియో.. ఈ ప్లాన్ అదిరిపోయిందిగా..
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:55 AM
రిలయన్స్ జియో ఇటీవలే రూ.1,958కు 365 రోజులపాటు, రూ.458కు 84 రోజుల చెల్లుబాటుతో వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. ఆ తర్వాత కంపెనీ వాటిని ధరలను తగ్గిస్తూ సవరణ చేసింది.

బిజినెస్ న్యూస్: టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio New) తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశంలోని ప్రీపెయిడ్ చందాదారుల కోసం చవకైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌ను పునరుద్ధరించింది. రూ.189కే అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS), పరిమిత డేటా ప్యాక్ (Data Pack) సేవలతో ప్లాన్‌ను తీసుకొచ్చింది. TRAI ఆదేశాలకు కట్టుబడి రిలయన్స్ జియో ఇటీవల వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించింది. కొంతకాలం తర్వాత ఈ కంపెనీ తక్కువ, సరసమైన ధరలకే సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చౌక ధరలకే వాయిస్ కాల్స్, SMS కోసం స్వతంత్ర ప్రత్యేక టారిఫ్ వోచర్‌లు(STV) అందించేందుకు సిద్ధమైంది.
రూ.189 ప్లాన్.. వివరాలు ఇవే..
భారతదేశంలోని ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రూ.189 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం 28 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఉచిత SMSలను జియో అందిస్తోంది. అలాగే 64Kbps స్పీడ్‌తో 2GB డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో కాంప్లిమెంటరీ జియో సినిమా ప్రీమియం యాక్సెస్‌కు అవకాశం లేదు. ఈ ప్లాన్‌ను ఎక్కువగా డేటా అవసరం లేని చందాదారులు వినియోగించుకునే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో ఇటీవలే రూ.1,958కు 365 రోజులపాటు, రూ.458కు 84 రోజుల చెల్లుబాటుతో వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకొచ్చింది. ఆ తర్వాత కంపెనీ వాటిని ధరలను తగ్గిస్తూ సవరణ చేసింది. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా రూ.1,748, రూ.448కే సేవలు అధించేందుకు ధరల్లో మార్పులు చేసింది. అయితే వాటి కాల పరిమితిని 336 రోజులకు కుదించింది. ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold And Silver Prices Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
Tax slabs : పాతదా? కొత్తదా? మీకేది మేలో ఇక్కడ చూడండి..