Share News

RBI Latest Announcement: రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు

ABN , Publish Date - Nov 02 , 2025 | 02:56 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై తరచూ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 2,000 నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉన్నాయి.

RBI Latest Announcement: రూ.2000పై ఆర్బీఐ కీలక ప్రకటన.. చలామణిలో రూ.5,817 కోట్లు విలువైన నోట్లు
RBI

బిజినెస్ న్యూస్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లపై తరచూ కొన్ని కీలక ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంకా 2,000 నోట్లు చట్టబద్దంగా చలామణిలో ఉన్నాయి. తాజాగా ఆర్బీఐ రెండు వేల నోటుపై కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. రూ.5,817 కోట్ల విలువైన అధిక విలువ గల రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి.


2023 మే 19న ఆర్బీఐ(RBI) కరెన్సీ నోటు ఉపసంహరణ ప్రకటించే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఉపసంహరణ(RBI 2000 note withdrawal) కారణంగా చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 98.37 శాతం తిరిగి వచ్చాయని శనివారం వెల్లడించింది. అలానే రూ.5,817 కోట్లకు చలామణి తగ్గిందని తెలిపింది. ఈ నోట్లను మార్చుకునే సౌకర్యం ఆర్బీఐ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.


2023 అక్టోబర్ 9 నుండి ఆర్బీఐ కార్యాలయాలు వ్యక్తులు/సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాల(banking update)లో డిపాజిట్ చేయడానికి రూ. 2, 000నోట్లను కూడా అంగీకరిస్తున్నాయి. అహ్మదాబాద్ , బెంగళూరు , బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో , ముంబై , నాగ్‌పూర్, న్యూఢిల్లీ , పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో( RBI offices list) ఈ నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంది. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ, వాటి చలామణిపై కాలానుగుణంగా ఆర్బీఐ(rbi update) వెల్లడిస్తుంది.


ఇవీ చదవండి:

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త

India Auto Industry: వాహన విక్రయాల్లో రికార్డు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 02 , 2025 | 02:56 PM