Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:40 PM
ఇంకొన్ని రోజుల్లో మే 2025 నెల రాబోతుంది. ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే మాత్రం ఈ సెలవుల గురించి తప్పక తెలసుకోండి. ఈ క్రమంలో వచ్చే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఏప్రిల్ నెల మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇదే సమయంలో బ్యాంకులు కూడా ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో మీరు వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పనుల కోసం చూస్తున్నారా. అయితే ఓసారి ఈ సెలవుల గురించి తెలుసుకుని ప్లాన్ చేసుకోండి మరి. ఎందుకంటే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోకుండా వెళితే మీరు ఇబ్బందులు పడే ఛాన్సుంది. మే 2025లో మొత్తం 12 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎప్పుడు బ్యాంకులు బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మే 2025లో బ్యాంకు సెలవులు పూర్తి జాబితా
01 మే 2025 (గురువారం) – బెలాపూర్, బెంగళూరు, చైన్నై, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, ఇంఫాల్, కోచి, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పనాజీ, పాట్నా, తిరువనంతపురం ప్రాంతాల్లో సెలవు
04 మే 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
09 మే 2025 (శుక్రవారం) – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో మాత్రమే సెలవు
10 మే 2025 (శనివారం)- నెలలో రెండో శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి
11 మే 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
12 మే 2025 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో సెలవు
16 మే 2025 (శుక్రవారం) - వార్షిక దినోత్సవం నేపథ్యంలో సిక్కింలో హాలిడే
18 మే 2025 (ఆదివారం)- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
24 మే 2025 (శనివారం) – నెలలో నాల్గో శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి
25 మే 2025 (ఆదివారం) – వారాంతపు సెలవు
26 మే 2024 (సోమవారం)-కవి కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మదినోత్సవం నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులకు సెలవు
29 మే 2024 (గురువారం)- మహారాణా ప్రతాప్ జయంతి జన్మదినోత్సవం సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు హాలిడే
ఆన్‌లైన్ సేవలు మాత్రం..
అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఒకేలా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం పలు ప్రాంతాలకు స్థానిక పండగుల సెలవులు మారుతుంటాయి. బ్యాంకులు మూసివేయబడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెలవు రోజుల్లో కూడా, ప్రజలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సహా తమ పనులన్నింటినీ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. బ్యాంకు సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల, సెలవు రోజుల్లో కూడా మీరు ఇంట్లో కూర్చొని అనేక బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News