Ram Charan: రిలయన్స్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:00 AM
పాన్ ఇండియా స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు సినిమాలతోపాటు పలు రకాల బ్రాండ్లకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఆధ్వర్యంలోని కాంపా శీతలపానీయం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.

మార్కెట్లోకి రీ ఎంట్రీ వచ్చిన శీతలపానీయం కంపా ఇప్పుడు మళ్లీ కొత్త ప్రచారానికి సిద్ధమైంది. రిలయన్స్ ఆధ్వర్యంలో 2023లో రీబ్రాండింగ్‌కు గురైన కాంపా, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan)ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. ఈ క్రమంలో పాత తరం నుంచి కొత్త తరం స్పూర్తిని జత చేస్తూ, కాంపా మళ్లీ అనేక మంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బ్రాండ్లు వినియోగదారులతో మానసికంగా కనెక్ట్ కావాలంటే ఆయా ఉత్పత్తులను ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం.
ఇలాంటి క్రమంలోనే రిలయన్స్..స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఎంపిక చేసుకుంది. చెర్రీకి తెలుగు రాష్ట్రాలతోపాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తన క్రేజ్ మరింత పెరిగింది. వింటేజ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కాంపా, రిలయన్స్ నుంచి 2023 మార్చిలో రీ ఇంట్రీ ఇచ్చి క్రమంగా విస్తరిస్తోంది. కాంపా ఇప్పుడు కేవలం తీపి శీతలపానీయంగా కాకుండా, యువతను ఆకట్టుకుని మిగతా బ్రాండ్లకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది.
ఈ ప్రచారం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం వాణిజ్య ప్రకటనగా కాకుండా, ఒక స్ఫూర్తిదాయకమైన కథనంగా ఉందని పలువురు అంటున్నారు. ఇందులో వినిపించే సందేశం స్పష్టంగా ఉంది. విజయం అనేది తాత్కాలిక విజయం కాదు, అది స్థిరమైన కృషితో మాత్రమే సాధ్యమవుతుంది. చరణ్ ఇందులో చేసిన స్టంట్లు కూడా అతనే స్వయంగా చేశాడంటే, ఈ ప్రచారానికి ఆయన ఎంత అంకితభావంతో ఉన్నారో అర్థమవుతుంది.
‘కాంపా వాలి జిద్’ ప్రచారాన్ని అత్యంత ప్రాచుర్యం కలిగిన IPL సీజన్‌లో ప్రారంభించడం కూడా ఒక స్ట్రాటజీ అని చెప్పవచ్చు. మిలియన్ల మందికి చేరుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. టెలివిజన్, డిజిటల్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విస్తృతంగా ప్రచారం పొందేందుకు యువతను లక్ష్యంగా చేసుకుంది. ఎలాంటి డైలాగులు అవసరం లేకుండా ఒక చూపు, ఒక అడుగు, ఒక యాక్షన్ ద్వారా మనోబలాన్ని చూపగలిగే వ్యక్తిత్వం రామ్ చరణ్‌ది. కాంపా బ్రాండ్ ఇప్పుడు ఈ శక్తివంతమైన ప్రచారం ద్వారా తన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళుతోంది.
ఇవి కూడా చదవండి:
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News