Share News

PM Kisan 20th Installment: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతులకు ఆ రోజే వస్తాయా..

ABN , Publish Date - Jul 16 , 2025 | 04:01 PM

పీఎం కిసాన్ నిధి (PM-KISAN) 20వ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జూలై 18, 2025 (శుక్రవారం)న రైతుల బ్యాంక్ ఖాతాల్లో 20వ విడత జమ కానుందని తెలుస్తోంది. అయితే ఎందుకు అదే రోజు పడుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PM Kisan 20th Installment: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు  రైతులకు ఆ రోజే వస్తాయా..
PM Kisan 20th Installment

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత (PM Kisan 20th Installment) మనీ కోసం దేశంలో కోట్లాది మంది రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇది జూలై 18, 2025 (శుక్రవారం) వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం బీహార్ పర్యటనకు వెళ్తున్నారు.

సమాచారం ప్రకారం, జూలై 18న తూర్పు చంపారన్‌లోని మోతీహారీలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ. 2,000 చొప్పున నేరుగా జమ చేయడానికి ప్రధాని బటన్‌ నొక్కే అవకాశం ఉందని సమాచారం.


పీఎం కిసాన్ పథకం

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది. ఇది దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఏటా రూ. 6,000 మూడు సమాన విడతలలో (ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000) వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ నిధులు రైతుల వ్యవసాయ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. మొత్తం రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి.


20వ విడత కోసం రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులు

  • పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలను పాటించాలి.

  • ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్: రైతుల వారి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. దీని ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా మనీ ట్రాన్స్‎ఫర్ జరుగుతుంది.

  • ఆధార్ సీడింగ్ స్థితిని తనిఖీ చేయండి: మీ బ్యాంకు ఖాతాతో ఆధార్ సీడింగ్ సరిగ్గా జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి

  • DBT ఆప్షన్ యాక్టివ్‌గా ఉంచండి: ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాలో DBT ఆప్షన్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి

  • ఈ-కేవైసీ పూర్తి చేయండి: ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. దీనిని ఆన్‌లైన్‌లో ఓటీపీ ద్వారా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

  • లబ్ధిదారుల జాబితాలో పేరు తనిఖీ: పీఎం కిసాన్ పోర్టల్‌లోని Know Your Status ఆప్షన్ ద్వారా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.


లబ్ధిదారుల లిస్ట్ ఎలా చెక్ చేయాలి

  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి కింది దశలను అనుసరించండి

  • ముందుగా అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://pmkisan.gov.in/

  • హోమ్‌పేజీలో Payment Success ట్యాబ్ కింద ఇండియా మ్యాప్‌ కనిపిస్తుంది

  • కుడి వైపున ఉన్న Dashboard అనే ఎల్లో కలర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

  • ఆ తర్వాత కొత్త పేజీలో Village Dashboard ట్యాబ్‌లో మీ పూర్తి వివరాలను నమోదు చేయండి

  • రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, పంచాయతీని ఎంచుకోండి

  • ఆ తర్వాత Show బటన్‌పై క్లిక్ చేయండి

  • ఆ క్రమంలో Get Report బటన్‌పై క్లిక్ చేయండి

  • ఇప్పుడు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుస్తుంది


బీహార్‌లో ఘనంగా విడుదల

ఈ ఏడాది ఫిబ్రవరి 24న బీహార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 19వ విడతను విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులు, అందులో 2.41 కోట్ల మహిళా రైతులు రూ. 22,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో అందుకున్నారు.

సహాయం కోసం సంప్రదించండి

ఏవైనా సందేహాలు లేదా సమస్యల కోసం రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 011-24300606ను సంప్రదించవచ్చు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 04:03 PM