Share News

PF Withdrawal Rules: పదవీ విరమణ వరకు అక్కర్లేదు.. మీ పీఎఫ్ మొత్తం ఒకేసారి తీసుకునే ఛాన్స్

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:57 PM

ఉద్యోగులకు నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొదుపులను ఉపసంహరించాలంటే ఉద్యోగం మానేయడం లేదా పదవీ విరమణ వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధన ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PF Withdrawal Rules: పదవీ విరమణ వరకు అక్కర్లేదు.. మీ పీఎఫ్ మొత్తం ఒకేసారి తీసుకునే ఛాన్స్
PF Withdrawal Rules

ప్రతి నెల జీతం పొందే ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొదుపులను ఉపసంహరించడానికి పదవీ విరమణ లేదా ఉద్యోగం కోల్పోయే వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. పీఎఫ్ చందా దారులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ మొత్తం కార్పస్‌ను లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకునే (PF Withdrawal Rules) అవకాశం పొందవచ్చు. ఈ మార్పు ఉద్యోగులకు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సౌలభ్యాన్ని అందిస్తుంది.


పూర్తి నిధులను..

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేయడానికి సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే మరికొన్ని రోజుల్లో అమల్లోకి రానుంది. ప్రస్తుతం పీఎఫ్ సభ్యులు తమ పూర్తి నిధులను ఉపసంహరించుకోవడానికి కొన్ని నిర్దిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో సాధారణంగా 58 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగం ఉంటే, కొన్ని నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే అనుమతించబడేది.


ఖర్చులను కూడా..

దీంతోపాటు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం, వైద్య అత్యవసర పరిస్థితులు, విద్యా ఖర్చులు, వివాహ సంబంధిత ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకునే వారు. ఈ నిబంధనలు ఉద్యోగులకు కొంత సౌలభ్యాన్ని అందించినప్పటికీ, నిధులను యాక్సెస్ చేయడంలో మాత్రం ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలతో మర్పు చేయనున్నారు.


ఏం మారింది

ఈ నెల నుంచి పీఎఫ్ సభ్యులకు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం తమ పొదుపులలో 90 శాతం వరకు ఉపసంహరించే అవకాశం కల్పించారు. గతంలో, ఈ ప్రయోజనం కేవలం ఐదు సంవత్సరాల నిరంతర చందా తర్వాత మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ అర్హత వ్యవధిని మూడు సంవత్సరాలకు తగ్గించారు. ఈ మార్పు ఎక్కువ మంది ఉద్యోగులు తమ పొదుపులను ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది.


ఈ మార్పులు ఎందుకు ముఖ్యం

అంతేగాక అడ్వాన్స్ క్లెయిమ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు. ఈ కొత్త నిబంధనలు నిధులను యాక్సెస్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ముందస్తు ఆమోదాల అవసరం లేకుండా త్వరగా నిధులను పొందవచ్చు. ఈ మార్పులు ఉద్యోగులకు తమ ఆర్థిక అవసరాలను తీర్చడంలో మరింత స్వేచ్ఛను అందిస్తాయి.

ఈ కొత్త నిబంధనలు ఉద్యోగులకు తమ ఆర్థిక భవిష్యత్తును మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. గతంలో పీఎఫ్ నిధులను యాక్సెస్ చేయడానికి ఎక్కువ కాలం పట్టేది. కానీ ఇప్పుడు ఈ సరళీకృత నిబంధనలతో ఉద్యోగులు తమ జీవితంలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకునేందుకు మరింత అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 03:59 PM