India Economy: పన్ను వసూళ్లు తగ్గాయ్..
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:10 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా....

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 1.34% తగ్గి రూ.5.63 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లు అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు నికరంగా 3.67% తగ్గి రూ.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన కార్పొరేట్ పన్నుల పరిమాణం రూ.2.07 లక్షల కోట్లుంది. ఇక నాన్ కార్పొరేట్ పన్ను (వ్యక్తిగత ఆదాయపు పన్ను, హెచ్‌యూఎ్‌ఫలు, సంస్థలు) వసూళ్లు రూ.3.45 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను ద్వారా రూ.17,874 కోట్లు వసూలైంది. నికర రిఫండ్ల విలువ 38ు పెరిగి రూ.1.02 లక్షల కోట్లకు చేరింది.