Share News

Mahindra Revx Series: మహీంద్ర రివెక్స్‌ సిరీస్‌ ఎస్‌యూవీలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:19 AM

ఎస్‌యూవీ మార్కెట్‌లో అగ్రగామి మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ మార్కెట్‌పై పట్టు బిగిస్తోంది..

Mahindra Revx Series: మహీంద్ర రివెక్స్‌ సిరీస్‌ ఎస్‌యూవీలు

  • ప్రారంభ ధర రూ.8.94 లక్షలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎస్‌యూవీ మార్కెట్‌లో అగ్రగామి మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ మార్కెట్‌పై పట్టు బిగిస్తోంది. రివెక్స్‌ సిరీ్‌సలో కొత్తగా మూడు కంపాక్ట్‌ ఎస్‌యూవీలను మార్కెట్‌లో విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ’ కంపాక్ట్‌ ఎస్‌యూవీలను మరింత మెరుగు పరిచి ‘రివెక్స్‌ ఎం, రివెక్స్‌ ఎం (ఓ), రివెక్స్‌ ఏ’ పేర్లతో ఈ మూడు సరికొత్త కంపాక్ట్‌ ఎస్‌యూవీలను విడుదల చేస్తున్నట్టు కంపెనీ దక్షిణ భారత విభాగం సేల్స్‌ జోనల్‌ హెడ్‌ అరుణాగ్షు రాయ్‌ చె ప్పారు. ఐదు రంగుల్లో లభించే వీటి బుకింగ్స్‌, డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. వీటి ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర వేరియంట్‌ను బట్టి రూ.8.94 లక్షల నుంచి రూ.11.79 లక్షల వరకు ఉంటుందన్నారు. ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ’ ఎస్‌యూవీల వలెనే రివెక్స్‌ సీరిస్‌ ఎస్‌యూవీలకూ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్టు రాయ్‌ చెప్పారు.

ఫీచర్స్‌ రిచ్‌ ఎస్‌యూవీలు: రివెక్స్‌ సీరి్‌సలో ప్రవేశపెట్టిన ఈ మూడు ఎస్‌యూవీల్లో అనేక అత్యాధునిక ఫీచర్స్‌ జోడించినట్టు రాయ్‌ తెలిపారు. రూ.10 లక్షల లోపు ధర ఉన్న మరే ఇతర కంపెనీ ఎస్‌యూవీల్లోనూ ఇన్ని అద్భుత ఫీచర్లు లేవన్నారు. బ్లాక్‌ అలాయ్‌ వీల్స్‌, సరికొత్త బాడీ కలర్డ్‌ గ్రిల్‌, డ్యూయెల్‌ టోన్‌ రూఫ్‌, ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్స్‌, కస్టమర్ల అభిరుచులకు అనుగుణమైన ప్రీమియం ఇంటీరియర్స్‌ ఈ మూడు రివెక్స్‌ సీరిస్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీల ప్రత్యేకత. ఏపీ, తెలంగాణ నుంచి కూడా ఈ మూడు ఎస్‌యూవీలకు మంచి స్పందన లభిస్తోందని రాయ్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 01:19 AM