Share News

Investment Plan: LICలో నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది, ట్యాక్స్ ప్రయోజనాలు ఏంటి..

ABN , Publish Date - Jul 14 , 2025 | 08:01 PM

మీ భవిష్యత్తు కోసం మంచి సేవింగ్ ప్లాన్ తీసుకోవాలని చూస్తున్నారా. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ, భవిష్యత్తులో నిర్భయంగా జీవించాలనుకుంటున్నారా? అయితే LIC జీవన్ ఉత్సవ్ పాలసీ మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Investment Plan: LICలో నెలకు రూ.10 వేల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది, ట్యాక్స్ ప్రయోజనాలు ఏంటి..
Investment Plan

మీరు గ్యారంటీడ్ సేవింగ్స్ కోసం ప్లాన్ చేస్తున్నారా. అలాంటి వారి కోసం LICలో జీవన్ ఉత్సవ్ పాలసీ ఉంది. దీనిలో మీరు మీ స్థాయిని బట్టి నెలకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీంలో మీరు ప్రతి నెల రూ. 10,000 చొప్పున 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, రిటైర్మెంట్ సమయానికి మీకు దాదాపు రూ.63.6 లక్షలు లభిస్తాయి. ఇక్కడ మీరు 10 ఏళ్లలో చెల్లించేది కేవలం రూ.12 లక్షలు మాత్రమే. కానీ మీకు వచ్చేది మాత్రం దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.


ప్రతి సంవత్సరం కూడా..

మీరు 30 ఏళ్ల వయసులో జీవన్ ఉత్సవ్ పాలసీ తీసుకుంటే, మీరు ప్రతి సంవత్సరం రూ.1.2 లక్షలు చెల్లించి 10 ఏళ్లలో రూ. 12 లక్షలు చెల్లిస్తారు. 11వ సంవత్సరం నుంచి, ప్రతి సంవత్సరం దాదాపు రూ. 3.5 లక్షల వరకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పొందవచ్చు. లేదా ఒకేసారి కూడా మీ అవసరాన్ని బట్టి మొత్తం డబ్బును తీసుకోవచ్చు. మొత్తం లైఫ్‌ టైమ్‌లో ఈ ఇన్‌కమ్ వల్ల రాబడిగా రూ.60 లక్షల కన్నా ఎక్కువ వస్తుంది.


జీవన్ ఉత్సవ్ పాలసీ అంటే ఏంటి?

LIC జీవన్ ఉత్సవ్ అనేది ఒక గ్యారంటీడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ పాలసీ. అంటే, ఇది షేర్ మార్కెట్ మీద ఆధారపడదు. అలాగే లాభాల్లో పాలసీహోల్డర్‌కు వాటా ఉండదు. కానీ, దీనిలో గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఉంటుంది. అంటే మీరు పెట్టే డబ్బుకి నిర్ణీత శాతం రాబడి వస్తుంది.


ఇది ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద వస్తుందా?

ఈ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలు, రైడర్ ప్రీమియంలతో సహా, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటాయి. సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు పొందాలంటే, వార్షిక ప్రీమియం సొమ్ము అసలు మొత్తం(Sum Assured)లో 10% కంటే తక్కువగా ఉండాలి.


సెక్షన్ 10(10D) కింద..

ఈ పాలసీ కింద చెల్లించబడే డెత్ బెనిఫిట్ (పాలసీదారు మరణం సంభవించినప్పుడు చెల్లించబడే మొత్తం) సెక్షన్ 10(10D) కింద పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. అదే విధంగా, సర్వైవల్ బెనిఫిట్స్ (రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్ లేదా ఫ్లెక్సీ ఇన్‌కమ్ బెనిఫిట్) కూడా సెక్షన్ 10(10D) కింద పన్ను రహితంగా ఉంటాయి. కానీ ఇది కొన్ని షరతులకు లోబడి ఉంటుంది.

రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే..

వార్షిక ప్రీమియం సొమ్ము సొమ్ము అసలు (Sum Assured)లో 10% కంటే తక్కువగా ఉండాలి. 01.04.2023 తర్వాత తీసుకున్న పాలసీలకు, వార్షిక ప్రీమియం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆదాయం పన్ను రహితంగా ఉండకపోవచ్చు. ప్రీమియంలపై వర్తించే GST లేదా ఇతర చట్టబద్ధమైన పన్నులు అదనంగా వసూలు చేయబడతాయి. ఇవి పన్ను మినహాయింపు పరిధిలోకి రావు.

నోట్ : స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి స్కీంలలో ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 08:04 PM